ఈ మద్య కొంత మంది భార్యాభర్తల అనుబంధానికి అర్థం లేకుండా చేస్తున్నారు. పెద్దల సాక్షిగా ఒక్కటైన జంట తర్వాత ఒంటరిగా జీవిస్తూ.. ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకొని చంపుకునే వరకు వెళ్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. వివాహం అనంతరం అక్రమ సంబంధాలతో భార్యా భర్తలు ఒకరినొకరు చంపుకోవడం.. దాంతో పిల్లలు అనాధలుగా మారడం లాంటి కేసుల చూస్తూనే ఉన్నాం. మరికొంత మంది పెళ్లైన తర్వాత అదనపు కట్నం కోసం ఆడవారిని చిత్ర హింసలకు గురిచేయడం లాంటివి చేస్తున్నారు.
తాజాగా ఓ యువతిని గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకొని అదనపు కట్నం కోసం ఆమెను హింసించి చవరికి ఆమె వేలు కట్ చేసి పారిపోయిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముంబయిలో నివసించే హసి అనే 22 ఏళ్ల యువతి, జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరికి చెందిన రవి నాయక్ ఫేస్ బుక్‌లో పరిచయం అయింది. ఆ తర్వాత కొంత కాలం ఇద్దరూ మేసేజ్ లు పంపుకుంటూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలను ఎదరించి రవి నాయక్ కొద్ది రోజుల క్రితమే ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
వివాహానంతరం ఇద్దరు కలిసి హైదరాబాద్‌కు మకాం మార్చారు. నగరంలోనే హసి బ్యుటీషియన్‌గా పని చేస్తుండగా.. రవి నాయక్ ఖాళీగా ఉండేవాడు. ఈ క్రమంలోనే రవి నాయక్ తనకు రూ.50 డబ్బు కావాలని.. భార్యను అడిగాడు. ఆమె తన వద్ద లేవని చెప్పింది.. దాంతో హసీ ని తీవ్రంగా కొట్టి కత్తితో ఓ వేలిని కట్ చేసి పారిపోయాడు. మరోసటి రోజు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో రవి నాయక్‌పై కేసు నమోదు చేశారు.