ఓయో రూమ్స్ ఇప్పుడు ప్రతి ఒక్క నోట వినిపిస్తున్న మాట. దేశంలోని ప్రధాన నగరాల్లో ఓయో రూమ్స్ హవా నడుస్తోంది. అదే సమయంలో ఓయో రూమ్ లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపోతున్నాయి అనేది కొందరి వాదన. కొందరు మద్యం సేవించేందుకు, జూదం ఆడేందుకు, వ్యభిచారం, మాదక ద్రవ్యాల వాడకం ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఓయో రూమ్ లు ఆవాసాలుగా మారిపోయాయి. ఎక్కడో ఒకచోట ఓయో రూమ్స్ లో గుట్టుచప్పుడు కాకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో ఓయో రూమ్ పై నిఘా ఏర్పాటు చేశారు. వీటిపై ఎప్పటికప్పుడు దాడులు జరుపుతున్నారు.
ఓయో రూమ్ నిర్వహణ విషయంలో సంబంధింత వ్యక్తులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు పలు సూచనలు చేశారు. ఓయో రూమ్ లో అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఓయో రూమ్ నిర్వహకులకు పలు సూచలను చేశారు. “ఓయో రూమ్ ప్రైవేటు పార్టీ జరుగుతున్నట్లు గుర్తించాం. రూల్స్ పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. సీసీ కెమెరాలు ఉండాలి… 6 నెలల స్టోరీజ్ ఉండాలి. ఎవరైన ఓయో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకువాలి” అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మరి.. ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.