భారత దేశంలో ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కొంత మంది మగాళ్లు మృగాలుగా మారిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళలు ఎవరినీ వదలడం లేదు.. పైశాచికంగా అత్యాచారాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ఎలాంటి మార్పులు మాత్రం రావడం లేదు. ఓ అమ్మాయి ఆటో డ్రైవర్ లైంగికంగా వేధించడంతో భయంతో కదులుతున్న ఆటో దూకిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. వివరాల్లోలకి వెళితే..
ఔరంగబాద్ జిల్లాలో రద్దీగా ఉన్న ప్రదేశంలో వేగంగా వెళ్తున్న ఆటో నుంచి ఓ అమ్మాయి కిందపడిపోయింది. ఆటో డ్రైవర్ ఆ అమ్మాయిని లైంగికంగా వేధించడంతో భయంతో ఆటో నుంచి దూకినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా ఆటో నుంచి బాలిక బయటకు దూకడంతో తలకు గాయం అయ్యింది. బాలిక పరిస్థితి చూసి స్థానికులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రోడ్డు పక్కన ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.
సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యంలో రద్దీగా ఉన్న రోడ్డు పై వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఒక ఆటో నుంచి బాలిక అకస్మాత్తుగా కింద పడిపోయింది.. వెంటనే అటుగా బైక్ పై వస్తున్న వ్యక్తి వెంటనే ఆపి పక్కన ఉన్నవారి సహాయం కోరాడు. అక్కడికి చేరుకున్న మరికొంత మంది సహాయం చేసి ఆస్పత్రికి తరలించారు. అమ్మాయి తలకు గాయం కావడంతో గిల గిలా కొట్టుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సదరు ఆటో డ్రైవర్ గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
#WATCH #CCTV #Crime #BREAKING#Maharashtra In #Aurangabad auto driver #molested girl in moving auto,minor girl jumped from moving auto,#girlinjured
After molesting the girl jumped from speeding #auto which was caught on CCTV #ACCIDENT pic.twitter.com/udGvgMgbry
— Harish Deshmukh (@DeshmukhHarish9) November 16, 2022