నేటి రోజుల్లో ఆత్మహత్యాయత్నం అంటే కామెడీ అయిపోయింది. ప్రతి చిన్న దానికి నేను పోతానంటూ.. తాడు తీసుకోవడమో.. పురుగుమందు తాగడమో చేస్తున్నారు. ప్రాణం తీసుకోవడం అంటే భలే కామెడీ అయిపోయింది వీళ్లకి. అలాంటి ఓ ప్రబుద్ధుడి గురించే ఇప్పుడు చెప్పబోతోంది. ఇంట్లో భార్యను టీ పెట్టమని కోరాడు. అందుకు ఆమె ఇంట్లో సరుకులు లేవని చెప్పింది. అంతే ఇంక పౌరుషం పొడుచుకొచ్చి.. సెల్ఫీ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముగ్గళ్లకు చెందిన ముద్దా రామకృష్ణ అనే యువకుడు ఈ ఘనకార్యం చేసింది. భార్య ఆశాజ్యోతిని టీ పెట్టమని కోరాడు. అందుకు ఆమె ఇంట్లో సరుకులు లేవని చెప్పింది. టీ పెట్టమని అడిగితే సరుకులు లేవు అంటావా అంటూ రామకృష్ణ కోపంగా ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. ఉదయం అనగా వెళ్లినోడు.. సాయంత్రానికి కూడా ఇంటికి రాలేదు.
రామకృష్ణ దారిలో ఓ పురుగుమందు డబ్బా తీసుకున్నాడు. తన భార్య చేసిన పనికి తనకు కోపం వచ్చిందని సెల్ఫీ వీడియో తీస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. ఆ వీడియో కుటుంబ సభ్యులు, మిత్రులకు పంపాడు. ఆ వీడియో చూసి పొలం దగ్గర పడిఉన్న రామకృష్ణను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. టీ పొడి, పంచదార మొత్తం కలిపినా రూ.100 అయ్యేవి.. ఇప్పుడు ఆస్పత్రి బిల్లు వేలల్లో అవుతుంది. రామకృష్ణ చేసిన పనికి ఆ మాత్రం అవ్వాలిలే అంటూ స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. రామకృష్ణ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కొడుకు భార్యపై మామ కన్ను! ఏకంగా పెళ్లి చేసుకోమంటూ!