తమ పెళ్లి విషయంలో తుది నిర్ణయం ఆడ పిల్లలదే అవుతుంది. వారు ఊ అంటేనే సంబంధాలు చూడటం మొదలు పెడుతున్నారు తల్లిదండ్రులు. ఇలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని ఆలోచనలను నిర్మోహమాటంగా చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగమున్నా, కోట్ల ఆస్తి సంపద ఉన్నా, వేల ఎకరాల భూమి ఉన్నా, పెద్ద బిజినెస్ వేత్త అయినా సరే.. తాము అనుకున్న క్వాలిటీస్ ఉంటేనే అతడితో తలవంచి తాళి కట్టించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
నేటి కాలంలో అమ్మాయిల కన్నా.. అబ్బాయిలకు వివాహాలు కావడం కష్టంగా మారింది. గతంతో పోలిస్తే.. అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు వారు విద్యావంతులు కావడంతో.. తమ పెళ్లి విషయంలో తుది నిర్ణయం వారిదే అవుతుంది. ఆడ పిల్ల ఊ అంటేనే సంబంధాలు చూడటం మొదలు పెడుతున్నారు తల్లిదండ్రులు. ఇలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని ఆలోచనలను నిర్మోహమాటంగా చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగమున్నా, కోట్ల ఆస్తి సంపద ఉన్నా, వేల ఎకరాల భూమి ఉన్నా, పెద్ద బిజినెస్ వేత్త అయినా సరే.. తాము అనుకున్న క్వాలిటీస్ ఉంటేనే అతడితో తలవంచి తాళి కట్టించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. లేదంటే సోలో బ్రతుకే సో బెటర్ అని భావిస్తున్నారు. దీంతో అబ్బాయిలు ముదిరిన బెండకాయలు అయిపోతున్నారు. వరకట్నం కాదూ.. ఎదురిచ్చి చేసుకుంటామన్న పిల్ల దొరకని పరిస్థితి. 30 ఏళ్లకు కూడా పెళ్లి కాని బ్రహ్మచారుల సంఖ్య నానాటికి పెరుగుతోంది.
30 ఏళ్లు దాటినా పెళ్లి కావడం లేదన్న దిగులుతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుక్కపట్నానికి చెందిన ప్రభాకర్.. గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. 30 ఏళ్లు దాటిపోయాయి. తనకు వివాహం చేయాలని తల్లిదండ్రులను అడిగేవాడు. అయితే కొన్ని అప్పులు ఉన్నాయని.. అవి తీరాక సంబంధాలు చూస్తామని ఇంట్లో వాళ్లు చెబుతుండేవారు. దీంతో ఇక తనకు పెళ్లి కాదని భావించిన అతడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆ బాధలోనే బుధవారం సాయంత్రం.. సమీపంలోని పొలాల్లోకి వెళ్లి విషం తాగాడు. అపస్మారక స్థితిలో చేరుకున్న అతడిని చూసిన స్థానికులు.. ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ ప్రభాకర్ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.