ఇటీవల కెమికల్ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజ్ లలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులు చెబుతున్నప్పటికీ యజమానులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఫ్యాక్టీరలు, కోల్డ్ స్టోరేజ్ లలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాటు చేయాలని అధికారులు చెబుతున్పప్పటికీ కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బంగాళదుంప కోల్డ్ స్టోరేజ్ పై కప్పు కూలి కింద పనిచేస్తున్న కార్మికులపై పడింది. ఈ ఘటనలో 8 మంది అక్కడిక్కడే చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ లో ఓ బంగాళదుంప కోల్ట్ స్టోరేజ్ పై కప్పు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 11 మందిని రెస్క్యూ టీమ్ రక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులతో పాటు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ సందర్బంగా మొరాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ మాట్లాడుతూ..‘బంగాళదుంప స్టోరేజ్ పై కప్పు కూలిపోయి ఎమిదిమంది చనిపోయారు.. 11 మందిని వెంటనే రక్షించగలిగాం.. ఈ ఘటనలో మరికొంత మంది తప్పిపోయారు.. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు రిస్క్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తుంది’ అని తెలిపారు.
గురువారం తెల్లవారుజాము నుంచి కోల్డ్ స్టోరేజ్ బంగాళదుంపలు స్టోరేజ్ చేసే పని జరుగుతుందని ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు. కొత్తగా నిర్మించిన భాగంలో బంగాళదుంప బస్తాలను రాక్ లపై ఉంచుతారు. వీటి సామర్ధ్యం ఎక్కువగా ఉండటవం వల్ల 11 గంటల ప్రాంతంలో ఒక రాక్ కిందపడిపోయింది. ఈ క్రమంలో పైకప్పు కూలిపోవడంతో కార్మికులు బంగాళదుంప బస్తాల కింద పడి ఊపిరి ఆడక చనిపోయారని.. మరికొంత మంది పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో కోల్డ్ స్టోరేజ్ యజమానులు అంకుర్ అగర్వాల్, రోహిత్ అగర్వాల లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
8 Killed, 11 Rescued After Cold Storage Roof Collapses In UP’s Sambhal https://t.co/ykiA4e0BMW pic.twitter.com/CZ7wT7Ghnr
— NDTV News feed (@ndtvfeed) March 17, 2023