డబ్బు కోసం కొందరు దుండగులు ఎంతకైన తెగిస్తున్నారు. చివరికి కన్న వాళ్లను సైతం హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. అచ్చం ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. పింఛన్ డబ్బుల కోసం కొందరు దుండగులు ఏకంగా 70 ఏళ్ల వృద్దురాలిని కొట్టి చంపారు. అనంతరం ఆమె వద్ద ఉన్న పింఛన్ డబ్బులు తీసుకుని కనిపించకుండా పరారయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది ఏపీలోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిన్నపులివర్రు. ఇక్కడే గుడిపల్లి లక్ష్మీవిలాసం అనే 70 ఏళ్ల వృద్దురాలు నివాసం ఉంటుంది. అయితే ఇటీవల లక్ష్మీవిలాసం పింఛన్ డబ్బులు తీసుకుని ఇంటకి వెళ్తూ ఉంది. ఈ క్రమంలోనే కొందరు దుండగులు ఆ వృద్దురాలి అడ్డగించి ఆ పింఛన్ డబ్బులు మాకు ఇవ్వాలంటూ గొడవ పడ్డారు. దీంతో ఆ వృద్దురాలు నిరాకరించింది. ఇక కోపంతో ఊగిపోయిన ఆ దుండగులు ఆ వృద్దురాలిని దారుణంగా కొట్టి చంపారు. అనంతరం ఆమె వద్ద ఉన్న డబ్బులు తీసుకుని దండుగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీనిని గమనించిన కొందరు స్థానికులు ఆ వృద్దురాలి వద్దకు చేరుకోగా ఆమె చనిపోయిందని తెలుసుకున్నారు.
ఇక స్థానికులు వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత మృతురాలి కుటుంభ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి ఇక ఎట్టకేలకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.