ఈ రోజుల్లో చాలా మంది మహిళలు కట్టుకున్న భర్తను కాదని పరాయి వాడితో కలిసి ఉండేందుకు ఎంతకైన తెగిస్తున్నారు. చివరికి అడ్డొచ్చిన భర్తలను సైతం ప్రియుడితో చేతులు కలిసి దారుణంగా హత్య చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత బరితెగించి ప్రవర్తించింది. తన ప్రియుడితో ఉండేందుకు అడ్డుగా ఉన్న తన 14 ఏళ్ల కొడుకుని దారుణంగా హత్య చేసింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ కిరాతక ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఏపీలోని అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం ప్రాంతం. ఇక్కడే మారుతినాయక్, కవిత దంపతులు నివాసం ఉంటున్నారు. బెంగుళూరుకు చెందిన కవితను మారుతి నాయక్ 14 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొంతకాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. భర్త లారీ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అలా కొంత కాలానికి ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు జన్మించారు. అయితే భర్త పని చేసే చోట అతనికి వినోద్ అనే యువకుడు పరిచయం అయ్యడు. దీంతో వినోద్ అప్పుడప్పుడు మారుతి నాయక్ ఇంటికి వస్తు ఉండేవాడు. అలా వస్తూ పోతూ ఉన్న సమయంలో మారుతినాయక్ భార్య కవితపై వినోద్ కన్ను పడింది. దీంతో కొన్నిరోజుల తర్వాత కవిత, వినోద్ ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు.
కొన్ని రోజుల తర్వాత భార్య కవిత సాగిస్తున్న చీకటి కాపురం భర్తకు తెలియడంతో మారుతినాయక్ భార్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే రెండు వారల కిందట కవిత తన కుమారుడిని తీసుకుని ప్రియుడి వినోద్ పాటు కడప జిల్లా బద్వెల్ కు పారిపోయి అక్కడే నివాసం ఉంటున్నారు. కానీ కవిత, ప్రియుడు వినోద్ మధ్య తన కుమారుడు అడ్డుగా ఉండడంతో అతడిని చంపాలని అనుకున్నారు. దీంతో ఓ రోజు రాత్రి ఇద్దరూ కలిసి ఇటీవల ఆ బాలుడిని చంపి వారు అద్దెకు ఉంటున్న ఇంటి సమీపంలోని పాతి పెట్టారు. కొన్ని రోజుల తర్వాత భర్త మారుతి నాయక్ భార్య కవిత వద్దకు వచ్చాడు. కొడుకు లేకపోవడంతో భార్య కవితను ప్రశ్నించాడు. నాకేం తెలియదు అన్నట్లుగా పొంతనలేని సమాధానాలు చెప్పింది.
దీంతో భార్య కవిత, ఆమె ప్రియుడిపై అనుమానం వచ్చిన భర్త మారుతి నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. భార్య కవిత, ఆమె ప్రియుడు వినోద్ ఇద్దరూ కలిసి ఆ బాలుడిని చంపి అద్దెకు ఉంటున్న ఇంటి సమీపంలో పూడ్చి పెట్టారని తేలింది. అనంతరం పోలీసులు తహశీల్దార్ సమక్షంలో పాతిపెట్టిన బాలుడి శవాన్ని వెలికితీశారు. అనంతరం పోలీసులు నిందితులైన కవిత, వినోద్ లను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రియుడి కోసం కన్న కొడుకుని చంపిన ఈ కసాయి తల్లి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.