మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంగళపర్తిగ్రామ శివారులో కారు దగ్దమైంది. ఇక ఇందులో మనిషి కాలిపోయిన శవాన్ని చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఎవరు ఏంటని ఆరా తీస్తున్నారు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్‌కు చేరుకునేలోపే మంటల ఆరిపోయాయి. ముందు సీట్లో వెనక సీట్లో ఎవరూ లేరు. కానీ డిక్కీలో మాత్రం కాలిపోయిన డెడ్‌బాడీ కనిపించింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం.. చంపేసి, ఆ తర్వాత మృతదేహాన్ని డిక్కీలో కుక్కేసి.. కారు మొత్తానికి నిప్పు పెట్టినట్టుగా పూసగుచ్చినట్లు అర్థమవుతోంది.
ఇక ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే హత్య చేసి ఆ తర్వాత కారులో బందించి తగలబెట్టినట్లు తెలుస్తోంది. ఇక నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును గుర్తించారు పోలీసులు. నెంబర్ ప్లేట్ ఆధారంగా కారు శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరి ఇంతకు కారులో కాలిపోయిన వ్యక్తి అతనేనా లేక మరి ఇతరులు ఎవరన్న దానిపై విచారణ జరుగుతోంది. కావాలనే గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేశారని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక దీనిపై పూర్తి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ఎలాగైన ఈ ఘటనకు కారణమైన వారిని పట్టుకునేందుకు అన్నివిధాలుగా విచారణ చేపడుతున్నామని పోలీసులు చెబుతున్నారు.