ఇటీవల 60 ఏళ్లకు వచ్చే గుండెపోటు 40 ఏళ్ల వయసువాళ్లకు రావడం.. హఠాత్తుకు ఉన్నచోటే కుప్పకూలిపోవడం చూస్తున్నాం. ఇటీవల పలువురు సెలబ్రెటీలు అప్పటి వరకు సంతోషంగా ఉండి హార్ట ఎటాక్ తో కన్నుమూసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతుంది. హార్ట్ ఎటాక్, గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ ఏదానా కావొచ్చు పట్టుమని నాలుగు పదులు కూడా నిండని చిన్నవయసులోనే చాలా మంది ఊపిరి ఆగిపోతోంది. ఇటీవల సినీ సెలబ్రెటీలు, సామాన్యులు అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. జిమ్, గేమ్స్ ఆడుతున్న సమయంలో ఈ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. బ్యాడ్మింటన్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు ఘటన మరువక ముందే.. ఓ కండెక్టర్ కదులుతున్న బస్సులోనే గుండెపోటుతో కన్నుమూశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కండెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బిక్షపతి నిన్న రాత్రి సంగారెడ్డి నుండి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కు బస్సులో బయలుదేశాడు. ప్రయాణీకులకు టిక్కెట్స్ ఇచ్చిన తర్వాత బిక్షపతికి ఛాతిలో నొప్పి రావడం మొదలైంది. హుటాహుటిన ఆటోలో బిక్షపతిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బిక్షపతి రాత్రి చనిపోయినట్లు వైద్యుల తెలిపారు. బిక్షపతి స్వస్థలం సిద్దిపేట.. ఆయన మృతితో కుటుంలో విషాదం నెలకొంది.
ఇదిలా ఉంటే బిక్షపతి మృతికి కారణం ఉన్నతాధికారులే అని.. ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగాలదేని చెబుతున్నా.. తనకు సెలవు మంజూరు చేయాలని కోరినప్పటికీ అధికారులు నిరాకరించడం వల్ల తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి వచ్చిందని అంటున్నారు. అంతేకాదు ఇటీవల చెకింగ్ అధికారులు బిక్షపతికి మెమో ఇచ్చారని.. ఆ వత్తిడిలు తట్టుకోలేక ఆయనకు గుండెపోటు వచ్చి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.