రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలోని వైశాలీ అనే యువతిని నవీన్ రెడ్డి అనే యువకుడు 100 రౌడీల సాయంతో ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు 6 గంటల్లోనే చేదించి యువతిని రక్షించారు. ఇక కిడ్నాప్ అనంతరం నిందితుడు యువతిని వదిలేసి అక్కడి నుంచి మరి కొందిమంది కనిపించకుండపోయారు. అనంతరం పోలీసులు అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక అప్పటి నుంచి పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుడు నవీన్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా నిందితుడు నవీన్ రెడ్డి గోవాలో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వెంటనే అక్కడికి చేరిన పోలీసులు నిందితుడు నవీన్ రెడ్డి తాజాగా గోవాలోని కాండోలిమ్ బీచ్ దగ్గర ఉండగా అరెస్ట్ చేశారు. నవీన్ రెడ్డి దగ్గర ఉన్న ఐదు ఫోన్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని నేరుగా హైదరాబాద్ కు తీసుకురానున్నామని పోలీసులు తెలిపారు.
అయితే ఈ ఘటనలో కిడ్నాప్ అయిన యువతి వైశాలీ మాత్రం నవీన్ రెడ్డి నాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాడని వాపోయింది. నా ఫోటోలు మార్ఫింగ్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపింది. ఇక ఇదే కాకుండా పెళ్లి చేసుకున్నానని కూడా చెబుతున్నాడని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని యువతి తెలిపింది. ఈ ఘటనతో నా కెరీర్ మొత్తం నాశనం అయిందని, నాకు రక్షణ కల్పించాలని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక మొత్తానికి నిందితుడు నవీన్ రెడ్డి తాజాగా అరెస్ట్ కావడంతో ఈ కేసు కాస్త కొలిక్కి వచ్చింది. ఇక ఈ కిడ్నాప్ కేసులో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.