దేశంలో ఉన్న పర్యాటక కేంద్రల్లో గోవా కి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ బీచ్ లో పర్యాటకులు ఎంతో ఆనందంగా గడుపుతుంటారు. గోవాలో పోర్చుగీసు నిర్మాణాలు.. అడవులు, జలపాతాలు చూస్తుంటే పర్యాటకులు తన్మయత్వంతో మైమరచిపోతుంటారు.
దేశంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ.. వాటిలో గోవా కి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గోవా అంటే అందమైన బీచ్, ప్రకృతి సోయగాలు, కాసినోలు, అద్భుతమైన రైడ్ లు మనిషి అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఆనందంగా గడిపే ప్రదేశం అంటారు. ఇక్కడ పోర్చుగీసు నిర్మాణాలు.. అడవులు, జలపాతాలు చూస్తుంటే పర్యాటకులు తన్మయత్వంతో మైమరచిపోతుంటారు. అలాంటి గోవాలో ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అంటున్నారు. కొంతకాలంగా గోవాలో మద్యపానం తీవ్రమైన సమస్యగా మారిందని.. ఈ వ్యసనాల కారణంగా ఎంతో మంది చిన్న వయసులోనే కన్నుమూస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల గోవా రాష్ట్రంలో మద్యం సేవించి చనిపోతున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని అత్యున్నత వైద్య సంస్థ అయిన గోవా మెడికల్ కాలేజ్ తెలిపింది. గత కొంత కాలంగా గోవాలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారికన్నా ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ తో బాధపడుతూ చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ ఉందని పేర్కొంది. గోవాలో 2022 లో సుమారు 318 మంది లివర్ వ్యాధితో బాధపడి చనిపోయిన వారు ఉంటే.. అంతకు ముందు ఏడాది 356 ఉన్నట్టు గోవా మెడికల్ కాలేజ్ తెలిపింది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల తో చనిపోయిన వారి సంఖ్య 271 గా పేర్కొంది. జీఎంసీ లెక్కల ప్రకారం కాలేజ్ లో రోజుకు ఐదు నుంచి ఆరు వరకు లివర్ సంబంధింత వ్యాధులతో బాధపడేవారు వస్తున్నట్లుగా గుర్తించామని తెలిపింది.
గోవాలో పర్యాటకులు సైతం ఎక్కువ మద్యం సేవిస్తూ ఉంటారని.. 2018 నుంచి ఇక్కడ ప్రజల్లో ఈ వ్యాధి తాలూకు కేసులు ఎక్కువగా బయట పడుతున్నాయని వైద్యులు తెలిపారు. ఈ సంద్భంగా గోవా మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ ఎస్.ఎం. బందేకర్ మాట్లాడుతూ.. ‘కొంత కాలంగా గోవాలో ఆల్కాహలిక్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. గోవా మెడికల్ కలేజ్ లెక్కల ప్రకారం.. ప్రతి నెల ఇక్కడ 5,500 మంది బాధితులు ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు.. ఇది రాష్ట్రానికి ఎంతో ప్రమాదకరం’ అని అన్నారు. నార్త్ గోవా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ డాక్టర్ రాజేష్ దుమే మాట్లాడుతూ.. నిత్యం మద్యం సేవించే వారిలో తక్కువ వయసులోనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. మనిషి శరీరంలో ఆల్కాహాల్ ఎన్నో అవయవాలను దెబ్బతీసి చనిపోవడానికి కారణం అవుతుంది. తాగుడు అలవాటుతో కుటుంబానికి, సమాజానికి చేటు చేస్తున్నారని అన్నారు.