ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నవారు సైతం అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడం.. ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపు కన్నుమూయడం జరుగుతుంది. చిన్నా పేద్దా అనే తేడా లేకుండా గుండెపోటు మరణాలతో జనాలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది.
మొన్నటి వరకు కరోనా భయపెడితే.. ఇప్పుడు హార్ట్ ఎటాక్ రూపంలో మృత్యువు భయపెడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటు మరణాల సంఖ్య పెరుగిపోతూనే ఉంది. అప్పటి వరకు మనతో పాటు సంతోషంగా మనతో గడిపిన వాళ్లు అకస్మాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోతూ ప్రాణాలు కోల్పోతున్నారు. పట్టుమని 30 ఏళ్లుకూడా నిండని యువకులు ఎక్కువగా గుండెపోటుతో కన్నుమూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో వరుసగా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. ఉదయం వరంగల్ లో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన వార్త మరువక ముందే నిజామాబాద్ లో మరో విషాదం నెలకొంది. ఓ యువకుడు హార్ట్ ఎటాక్ తో కన్నుమూశాడు. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య తెలంగాణలో వరుసగా హార్ట్ ఎటాక్ రావడంతో పలువురు యువకులు హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద ఓ మెడికల్ షాప్ కి వచ్చిన యువకుడు చాతి నొప్పి లేస్తుందని అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. నగరంలోని గాజులపేటకు చెందిన కుకునూరి రవి వయసు 32 సంవత్సరాలు.. బట్టల షాప్ లో పని చేస్తున్నాడు. మధ్యాహ్నం కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద ఉన్న ఎటీఎం లో కొంత డబ్బు డ్రా చేసుకొని మెడికల్ షాప్ కి వెళ్లాడు. అక్కడ కొన్ని మెడిసన్స్ తీసుకొని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా చాతి నొప్పి లేస్తుందని బాధపడ్డాడు.. అంతే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఒక్కసారే కిందపడిపోవడం వల్ల తలకు గాయమై అక్కడిక్కకడే కన్నుమూశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కాదు… రెండు కాదు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ గుండెపోటుతో మరణిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడాల లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు హార్ట్ స్టోక్ తో కన్నుమూస్తున్నారు. ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. హఠాత్తుకు ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. అయితే కొన్నిసార్లు అదృష్టం కొద్ది గుండెపోటు వచ్చిన వారికి సీపీఆర్ చేయడం వల్ల శ్వాస తీసుకొని బతికిపోతున్నారు. ఈ మద్య పలు చోట్ల హార్ట్ ఎటాక్ కి గురైన వారిని పోలీసులు సీపీఆర్ చేసి బతికించారు. ఇక రాష్ట్రంలో సీపీఆర్ ఎలా చేయాలి అన్న విషయంపై పలు చోట్ల అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
