ఒకప్పుడు తప్పులు చేసిన వాళ్ళని ఊళ్ళ నుంచి తరిమేసేవారు గ్రామ పెద్దలు. అయితే ఇప్పుడు కూడా అక్కడక్కడా కొన్ని గ్రామాల్లో ఈ వెలివేసే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తప్పు చేసిన వాళ్ళని వెలివేశారంటే అర్ధం ఉంది అని ఆలోచించవచ్చు. కానీ ఏ తప్పూ చేయని వాళ్ళని ఊరి నుంచి తరిమేయడమే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుత కాలంలో పది మంది గొట్టం గాళ్ళని ఏసుకుని పెదరాయుడు జమానా నడిపించడమే తప్పనుకుంటే.. ఏ తప్పూ చేయని ఒక కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేశారు ఓ ఊరి గ్రామ పెద్దలు. ఎవరైనా మాట్లాడితే 5 వేలు జరిమానా వేస్తా అన్నారు. దీంతో మనకెందుకొచ్చిందిలే అని గ్రామస్తులు ఎవరూ పట్టించుకోలేదు. విషయం మీడియా దృష్టికి వెళ్లడంతో గ్రామపెద్దలను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా చెరుకువాడ గ్రామంలో రాణి, సంతోష్ లు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అయితే గ్రామ పెద్ద ముసుగులో కనకారావు అనే నీచుడు పెళ్ళై.. పిల్లలున్న రాణిపై కన్నేశాడు. ఆమెను లోబరుచుకోవాలని చూశాడు. తనపై వేధింపులు ఎక్కువవడంతో కనకారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు. అయితే తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న ఆగ్రహంతో.. గ్రామ పెద్దలతో కలిసి బాధితురాలి కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేసేలా చేశాడు. అంతేకాదు రాణి కుటుంబంతో ఎవరు మాట్లాడినా.. రూ. 5 వేల జరిమానా విధిస్తామని అన్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు.. గ్రామ పెద్దలైనా కనకారావు, మోహన్ రావులపై కేసు నమోదు చేశారు.