కర్ణాటకలో దారుణం వెలుగు చూసింది. గుడిలోకి వచ్చిన ఓ దళిత మహిళ పట్ల ఆలయ ధర్మకర్త అసభ్యకరంగా వ్యవహరించాడు. ఇంతటితో ఆగకుండా నువ్వు నల్లగా ఉన్నావ్, పైగా స్నానం కూడా చయలేదు.. గుడిలో రావద్దని జుట్టుపట్టి మరీ బయటకు ఈడ్చుకెళ్లాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఈ ఘటనలో అసలేం జరిగింది? ఆలయ ధర్మకర్త ఆ దళిత మహిళను ఎందుకు చితకబాదాడు?. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది కర్ణాటక బెంగుళూరులోని అమృతహళ్లి ప్రాంతం. ఇక్కడే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది. అయితే డిసెంబర్ 21న ఓ మహిళ గుడిలోకి దేవుడి దర్శనానికి వెళ్లింది. ఆ మహిళ రాకను గమనించిన ఆలయ ధర్మకర్త మునికృష్ణప్ప ఆమెను గుడిలోకి రాకుండా అడ్డుకున్నాడు. నువ్వు నల్లగా ఉన్నావ్, పైగా స్నానం కూడా చేయలేదు, నువ్వు గుడిలోకి రాకూడదు కించపరిచే విధంగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఇదే విషయమై ఇద్దరూ గుడిలో గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఆలయ ధర్మకర్త ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె దేవుడి దర్శనానికి వెళ్తుంటే వెళ్లకుండా అడ్డుకున్నాడట. ఇక ఇంతటితో ఆగక ఆమె గుడిలోకి వెళ్లకుండా జుట్టు పట్టి మరీ బయటకు ఈడ్చుకెళ్లాడు.
అయితే ఆలయ ధర్మకర్త ఆ దళిత మహిళపై దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఈ దారుణ ఘటనపై ఆ మహిళ వెంటనే పోలీసుల స్టేషన్ కు వెళ్లి.. ఆలయ ధర్మకర్త దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా… ఆలయ ధర్మకర్త సైతం ఆ మహిళపై ఫిర్యాదు చేశాడు. ఆ మహిళ నాపై ఉమ్మి వేసిందని, దేవుడి గర్భగుడిలోకి వెళ్తానని పట్టుబట్టిందని, ఆ కారణంగానే ఆ మహిళపై నేను దాడి చేశానని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దళిత మహిళను జుట్టుపట్టి దారుణంగా చితకబాదిన ఆలయ ధర్మకర్త తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
A Dalit woman is being assaulted and removed from the temple premises in Bangalore, India! pic.twitter.com/RkTiMT4yCe
— Ashok Swain (@ashoswai) January 6, 2023