సాధారణంగా మనం పడుకున్న తర్వాత నిద్రలో కలలు రావడం సహజం. కానీ గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం వీటి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నిద్రలో పిడ కలలు వస్తున్నాయని మాంత్రికులను సంప్రదిస్తుంటారు. కానీ హిమాచల్ ప్రదేశ్ లోని ఓ యువకుడు నిద్రలో పీడ కలలు వస్తున్నాయని షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు. ఇదే ఘటన స్థానికంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. పీడ కలలు వస్తున్నాయని ఆ యువకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది హిమాచల్ ప్రదేశ్ కూలు జిల్లాలోని బంజార్ ప్రాంతం. ఇక్కడే ఓ 17 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. ఈ బాలుడు స్థానికంగా 11వ తరగతి చదువుతున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆ బాలుడికి సరిగ్గా నిద్ర రావడం లేదు. నిద్రపోయిన మధ్యరాత్రి తనంతట తానే లేచి కూర్చుంటున్నాడు. పైగా పీడకలలు కూడా వస్తున్నాయని భయపడిపోయాడు. రోజు అలా పీడకలలు ఎక్కువవుతుండడంతో భయపడిపోయాడు. తల్లిదండ్రులకు చెప్పాలని ప్రయత్నించాడు. కానీ ఎందుకో చెప్పలేక.. తనంతట తానే కుమిలిపోయాడు. ఇక భరించలేని ఒత్తిడికి లోనైన ఆ బాలుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇక నా వల్ల కాదని భావించిన ఆ బాలుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.
అనుకున్నదే ఆలస్యం.., ఆ బాలుడు.. నాకు రోజూ సరిగ్గా నిద్రరావడం లేదు, పైగా పీడకలలు వస్తున్నాయి. వీటిని భరించడం నా వల్ల కావడం లేదు. అందుకే చనిపోతున్నాను.. అంటూ సూసైడ్ నోట్ రాసి ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పీడ కలలు వస్తున్నాయని ఆత్మహత్య చేసుకున్న ఈ బాలుడి డిసిషన్ ఎంత వరకు కరెక్ట్? ఇలాంటి వారికి మీరిచ్చే సూచనలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.