ప్రపంచంలోనే అత్యంత పాతదిగా భావిస్తున్న ఓ విస్కీ బాటిల్‌ను ఇటీవల వేలం వేశారు. 250 ఏళ్ల నాటి ఆ బాటిల్ వేలంలో అక్షరాలా రూ.1 కోటి ధర పలికింది. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సీసాపై ఉన్న లేబుల్‌పై దాని వివరాలున్నాయి. దాని ప్రకారం అందులోని మద్యం బర్బన్ విస్కీగా గుర్తించినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు. 1860 నాటిదిగా భావిస్తున్న ఈ బాటిల్‌లోని మద్యం అప్పటికన్నా 100 ఏళ్ల పూర్వం నాటిదిగా అంచనా వేస్తున్నారు. ఆ కాలంనాటి ప్రఖ్యాత సంపన్నుడు జేపీ మోర్గాన్ దీనిని సేకరించినట్లుగా చెబుతున్నారు.
అమెరికా బోస్టన్‌కు చెందిన హౌస్ స్కిన్నర్ ఇంక్ అనే కంపెనీ ఈ విస్కీ బాటిల్‌ని వేలం వేసింది. వేలం పాట వేసే ముందు దీని ధర 20-40 వేల డాలర్ల మధ్య అమ్ముడవుతుందని భావించినా అనూహ్యంగా అది ఊహించని ధర పలికింది. ఈ ఏడాది జూన్ 30న జరిగిన వేలంలో ఈ బాటిల్‌ను మిడ్‌టౌన్ మాన్హాటన్‌లోని మ్యూజియం, పరిశోధనా సంస్థ ది మోర్గాన్ లైబ్రరీ 1,37,500 డాలర్లకు సొంతం చేసుకుంది. అంటే అక్షరాలా మన కరెన్సీలో 1,02,63,019 రూపాయలు అనమాట.
బాటిల్ ప్రసిద్ధ ఫైనాన్షియర్ జాన్ పియర్ పాయింట్ మోర్గాన్ ఆయన తన కొడుకు ఇచ్చారని, అతను దాన్ని 1942-44 మధ్య దక్షిణ కరోలినా గవర్నర్ జేమ్స్ బైర్నెస్‌కు ఇచ్చారు. 1955లో పదవీ విరమణ చేసిన తర్వాత.. ఆయన దాన్ని స్నేహితుడు, ఆంగ్ల నావికాదళ అధికారి ఫ్రాన్సిస్ డ్రేక్‌కు పంపారు. ఆయన దాన్ని మూడు తరాల పాటు కాపాడారు.
ఇప్పటికీ విస్కీ బాటిల్ రెండు శతాబ్దాలకుపైగా చెందినది మద్యం ప్రస్తుతం తాగేందుకు వీలు కాదని, బాటిల్ తెరువకపోతే సుమారు పది సంవత్సరాల పాటు నిల్వ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.