దేశంలో ఇంధన ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీని ప్రభావం మిగతా అన్నింటి మీద పడి నిత్యవసరాల ధరలు భారీగా పెరిగి.. సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.120, డీజిల్ 105కి చేరింది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువే ఉంది. పెరిగిపోతున్న ఇంధన ధరలను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ ని తగ్గించిందని.. కానీ రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించడం లేదని తెలిపారు. రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించకపోవడం వల్లే ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Nizamabad: దుబాయ్‌లో భర్త.. వేరే వ్యక్తితో కోడలి సంబంధం.. మందలించిన మామను..
అయితే మోదీ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ నాయకులు మండిపడుతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసలు పెట్రోల్ డీజిల్‌పై వ్యాట్ పెంచలేదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం టాక్స్ ఎంత ఉంది.. ప్రస్తుతం ఎంత పెరిగింది.. అలానే తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెరిగింది అంటూ జనాలు తెగ శోధిస్తున్నారు. మరి ఐదేళ్లకు ముందు.. ఐదేళ్ల తర్వాత ఇంధన ధరలు, టాక్స్ ఎలా ఉంది.. ఎంత పెరిగిందో చూడండి.
ఇది కూడా చదవండి: Alia Bhatt: కొత్త పెళ్లికూతురు ఆలియాపై దారుణమైన ట్రోలింగ్!
కేంద్ర ప్రభుత్వం టాక్స్…
2015లో
లీటర్ పెట్రోల్‌పై 9.48 పైసలు,
లీటర్ డీజిల్‌పై 3.56 పైసలు
2022 నాటికి..
లీటర్ పెట్రోల్‌పై 27.90 పైసలు,
లీటర్ డీజిల్‌పై 21.80పైసలు
అంటే ఐదేళ్ల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 18 రూపాయల టాక్స్ పెంచింది.
ఏపీలో స్టేట్ టాక్స్
2015లో..
లీటర్ పెట్రోల్‌పై టాక్స్- 18 రూపాయలు
లీటర్ డీజిల్‌పై టాక్స్- 9.85 రూపాయలు
లీటర్ పెట్రోల్ ధర- 71.51 రూపాయలు
లీటర్ డీజిల్ ధర- 57.28 రూపాయలు
2022లో..
లీటర్ పెట్రోల్‌పై టాక్స్-31.88 రూపాయలు
లీటర్ డీజిల్‌పై టాక్స్- 23.31రూపాయలు
లీటర్ పెట్రోల్ ధర- 121.20 రూపాయలు
లీటర్ డీజిల్ ధర- 106.82 రూపాయలు
పెట్రోల్, డీజిల్‌పై ఐదేళ్లలో టాక్స్ సుమారు 14 రూపాయలు పెరగ్గా.. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా 50 రూపాయలు పెరిగాయి.
తెలంగాణలో స్టేట్ టాక్స్
2015లో..
లీటర్ పెట్రోల్‌పై టాక్స్- 22.43 రూపాయలు
లీటర్ డీజిల్‌పై టాక్స్- 14.04 రూపాయలు
లీటర్ పెట్రోల్ ధర- 63.73 రూపాయలు
లీటర్ డీజిల్ ధర- 52.02రూపాయలు
2022లో..
లీటర్ పెట్రోల్‌పై టాక్స్-26.63 రూపాయలు
లీటర్ డీజిల్‌పై టాక్స్- 15.33రూపాయలు
లీటర్ పెట్రోల్ ధర- 119.49 రూపాయలు
లీటర్ డీజిల్ ధర- 105.49 రూపాయలు
ఐదేళ్లల్లో పెట్రోల్, డీజిల్‌పై టాక్స్ 4,1 రూపాయలు పెరగ్గా.. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా 50 రూపాయలకు పైగా పెరిగాయి. అంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు ఏటా ఎడాపెడా టాక్స్‌లు పెంచుతూనే ఉన్నాయి. కానీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరి ఇంధన ధరల పెరుగుదల విషయంలో ఎవరి వాదన నిజమని భావిస్తున్నారో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.