తనకు సొంత ఇళ్లు ఉండాలని ప్రతి సామాన్యుడికి కోరిక ఉంటుంది. అందుకోసం రేయింబవళ్లు కష్టపడి సంపాందించి కొందరు ఇళ్లు కొనుకుంటారు. మరికొందరు అయితే బ్యాంకులు, ఇతర మార్గాల్లో రుణాలు తీసుకుని ఇంటి నిర్మాణం చేపడుతుంటారు. అలా చాలా మంది గృహాల కోసం రుణాలు తీసుకుంటుంటారు. అలానే ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లతో వినియోగదారులకు రుణాలు మంజూరు చేస్తుంటాయి. అయితే అప్పుడప్పుడు బ్యాంకులు గృహణాలపై ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తాజాగా ప్రభుత్వ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంటి రుణంపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. గృహణ రుణాల వడ్డీ రేట్లపై డిస్కౌట్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ కూడా బ్యాంకు పరిమిత కాలవ్యవధిలోనే అందుబాటులో ఉంచుతుంది. కొత్త ఇళ్లు తీసుకోవాలనే ఆలోచన ఉన్నవారికి ఇది మంచి అవకాశం అని బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గృహ రుణాల వడ్డీ రేటును ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఈ బ్యాంకులో ఉన్న గృహ రుణాల వడ్డీ రేట్లు ప్రస్తుతం 8.25 శాతానికి వచ్చాయి. అలాగే పరిమిత కాల వ్యవధిలో ప్రాసెసింగ్ ఛార్జీలను కూడా బరోడా బ్యాంకు ఎత్తివేసింది. ఈ బంపర్ ఆఫర్ తో దిగ్గజ బ్యాంకులైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలతో పోలిస్తే.. బ్యాంకు ఆఫ్ బరోడాలోనే వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. షాపింగ్ మాల్స్ మాదిరిగా ఈ బ్యాంకులు కూడా పండగల సందర్భంగా డిస్కౌంట్ రేట్లను ప్రకటిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ రేట్ల ఆఫర్ జనవరి 2023 వరకు అందుబాటులో ఉంచింది. అదే విదంగాహెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్ నవంబర్ నెల చివరి వరకు వర్తిస్తుంది. వీటి వడ్డీరేట్ల తో పోల్చితే బ్యాంక్ ఆఫ్ బరోడా రేట్ చాలా తక్కువగా ఉంది.
బరోడా బ్యాంకు ప్రకటించిన ఈ కొత్త రేట్లు నవంబరు 14 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ డిస్కౌట్ ఆఫర్లు డిసెంబర్ చివరి వరకు అమల్లో ఉంటాయని బీవోబీ తెలిపింది. అలాగే ఎలాంటి ప్రీపేమెంట్ ఫీజులను కానీ పోస్టు పేమెంట్ ఛార్జీలు కానీ వినియోగదారు నుంచి వసూలు చేయమని బ్యాంకు స్పష్టం చేసింది. బ్యాంకింగ్ సెక్టార్ లో క అత్యంత కాంపిటేటీవ్ హోం లోన్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్న బ్యాంకుల్లో తాము ఒకరమని బ్యాంకు ఆఫ్ బరోడా ప్రకటించింది. ఈ కొత్త గృహరుణాల రేట్లు..తాజాగా హొం లోన్ తీసుకునే వారికి, బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్లకు వర్తిస్తుందని తెలిపింది. రుణగ్రహీతల క్రెడిట్ ప్రొఫైల్‌తో ఈ స్పెషల్ రేటు లింకై ఉంటుందని కూడా బ్యాంకు ఆఫ్ బరోడా పేర్కొంది. హోమ్ లోన్ రేట్లు పెరుగుతున్న ఈ సమయంలో.. ఈ రేట్లను చౌకగా అందించడం ఆనందంగా ఉందని అధికారులు తెలిపారు. గృహ కొనుగోలుదారులకు మరింత మంచి అవకాశాలుగా ఈ కొనుగోళ్లను మారుస్తున్నామని బీవోబీ మోర్టగేజస్ జనరల్ మేనేజర్ హెచ్‌టీ సోలంకి తెలిపారు.