ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అనేక ఆఫర్లతో, డిస్కౌట్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్షిస్తుంటుంది. తాజాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కు సిద్ధమైంది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రం ఒక రోజు ముందే సేల్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ ఫెస్టివల్ సేల్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు. వారం పాటు సేల్ ఉంటుందని టాక్ తెలుస్తోంది. ఈ సారి సేల్ లో ఏ ఏయే వస్తువులపై ఎంత డిస్కౌంట్ లభించనుందో తెలుసుకుందాం.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ భాగంగా ప్రతి సంవత్సరం లాగాగనే ఈసారి కూడా తన కస్టమర్లకు భారీ తగ్గింపులను ఇవ్వనుంది. ఈ సేల్ లో బట్టలు, యాక్సిసరీస్ , గాడ్జెట్లు, ఇతర ఉత్పత్తులు ప్రత్యేక డిస్కౌంట్స్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ లో భాగంగా ఎస్బీఐ క్రెడిట్/ డెబిట్ కార్డు దారులకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. డెబిట్/క్రెడిట్ కార్డ్ లపై నో కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు. ఈ సేల్ ను శామ్ సంగ్ గెలాక్సీ, ఐకూ స్పాన్సర్ చేస్తున్నాయి. వన్ ప్లస్ ,షావోమి, శామ్ సంగ్, ఐకూ మొబైల్స్ పై డిస్కౌట్లు లభించనున్నాయని అమెజాన్ టీజ్ చేస్తోంది. వీటితో పాటు ఐఫోన్ 13,12, ఐకూ 9T, వన్ ప్లస్ CE2 లైట్, నార్డ్-2 వంటి మొబైల్స్ పై కూడా ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. అయితే మీరు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండలేకపోతే, ప్రస్తుతం అమెజాన్ లో లైవ్ అవుతున్న కిక్ స్టార్టర్ డీల్ లనుచూడవచ్చు.
ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు మరిన్నింటిపై కూడా భారీ తగ్గింపుతో గొప్ప డీల్‌లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ప్రతి 6 గంటలకు కొత్త ఆఫర్‌లు అందుబాటులోకి రానుండడంతో, కస్టమర్‌లు గొప్ప ఓపెనింగ్ డే డీల్‌లను ఆశించవచ్చు. అయితే మరోవైపు అమెజాన్ కు పోటీగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తో ముందుకు రానుంది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ జరగనుంది. మరి.. అమెజాన్ అందిచనున్న ఈ అద్బుత ఆఫర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.