తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకుంది. తాజాగా ఆరవ సీజన్ కూడా విజయవంతగా ముగిసింది. దాదాపు వంద రోజులకి పైగా సాగిన బిగ్ బాస్ సీజన్-6 విన్నర్ గా ఫేమస్ సింగర్ రేవంత్ నిలిచాడు. మొదటి నుంచి అందరు సింగర్ రేవత్ టైటిల్ గెలుస్తాడని ఊహించగా.. అదే నిజమైంది. ఈ సీజన్ విన్నర్ గా రేవంత్ నిలువగా, రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన వ్యక్తి మరొకరు ఉన్నారు. అతడే ఆదిరెడ్డి అలియాస్ ఉడాల్ మామ. సామాన్యుడి స్థాయి నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, ఆ తరువాత టాప్ -4 లో ఒకడిగా నిలవడం వరకు అతడు సాగించిన ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తి. ఆదిరెడ్డి బిగ్ బాస్ టైటిల్ గెలవలేదు.. కానీ ప్రేక్షకుల మనస్సును మాత్రం గెలిచాడు. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు.
సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఆదిరెడ్డిది నెల్లూరు జిల్లాలోని కావలి సమీపంలోని వరికుంటపాడు. సొంతూరిలోనే డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. అనంతరం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఈక్రమంలోనే ఆదిరెడ్డి తల్లి మరణించింది. దీంతో ఆదిరెడ్డి రెండేళ్ల పాటు ఇంట్లోనే ఉన్నారు. తర్వాత ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్లారు. అదే సమయంలో బిగ్ బాస్ 2ని వివరిస్తూ, కౌశల్ గురించి మాట్లాడుతూ ఓ వీడియో చేశారు. అది వైరల్ గా మారడంతో ఆదిరెడ్డి గుర్తింపు పొందారు. అలా మూడో సీజన్ నుంచి ఈ షో గురించి వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యారు.
దీంతోపాటు బిగ్ బాస్ ఆట, అక్కడి రూల్స్, అక్కడ వాళ్లు పెట్టే గేమ్స్ ఇలా అన్నింటిపై ఆదిరెడ్డికి మంచి అవగాహన ఉంది. ఫాలోయింగ్ పరంగా చూసుకున్నా.. ఆదిరెడ్డికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈక్రమంలోనే అతడి చెల్లెలు నాగలక్ష్మి, భార్య కవితతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేసేవారు. అతని ఛానల్‌కు 3 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. 5 కోట్లకు పైగా వ్యూవర్ షిప్ ఉంది. నాగలక్ష్మికి కళ్లు కనిపించకపోయినా ఆమె కరోనా టైమ్ లో సోనూసూద్ చారిటీ ఫౌండేషన్ కి సాయం చేసి పాపులర్ అయ్యారు. ఆదిరెడ్డి భార్య కవిత, సోదరి నాగలక్ష్మి కలసి.. కవిత – నాగ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ తో బాగా పాపులర్ అయ్యారు. వంటల వీడియోలతో వీరు ఫేమస్ అయ్యారు. ఇలా సాగుతున్న ఆదిరెడ్డికి బిగ్ బాస్ సీజన్-6లో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. దీంతో వచ్చిన అవకాశాన్ని ఆదిరెడ్డి ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకున్నారు.
హౌస్ లో మొదటి రోజు నుంచే ఆదిరెడ్డి.. తనదైన మార్క్ ను చూపించాడు. తనదైన మాటలతో, తన మంచి వ్యక్తితంతో అందరికి అన్నలాగా మారిపోయాడు. ఎవర్ని నొప్పించకుండా, తాను చెప్పదల్చుకున్న మాటలను స్పష్టంగా తెలియజేసేవాడు. హౌస్ లో ఎక్కడ ఎవర్ని బాధ పెట్టేవాడు కాదు. అలా తనదైన శైలీతో ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్లుతో పాటు ఈ హౌస్ లోకి వచ్చిన ఆదిరెడ్డి.. వారందరిని దాటుకుంటూ టాప్-4 కంటెస్టెంట్ గా నిలిచాడు. అంతేకాక హౌస్ లోని అందరి సభ్యుల మనస్సు దోచుకున్నాడు. గీతు రాయల్ ఎలిమినేట్ అయ్యే సమయంలో ‘ఆదిరెడ్డి అన్న చాలా మంచోడు సార్’ అంటూ ఏడ్చుకుంటూ చెప్పిన మాటలు అందరికి తెలుసు. అలానే జబర్దస్త్ ఫైమా కూడా ఆదిరెడ్డిని మంచి వ్యక్తి అంటూ ప్రశంసించింది. అంతేకాక ఇలా మిగిలిన సభ్యుల సైతం ఆదిరెడ్డిని ప్రశంసించారు. ఇదే సమయంలో ఆదిరెడ్డి క్రేజ్ చూసి.. చాలా మంది అతడే బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడని భావించారు. కానీ చివరికి నాలుగో స్థానంతో సరిపెట్టుకుని హౌస్ నుంచి బయటకి వచ్చాడు.
ఇక్కడ ఒక విషయం ఏమిటంటే.. రేవంత్, శ్రీహన్ లు విజేతలు కావడంలో వింత ఏమిలేదు. ఎందుకంటే రేవంత్ కి ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ ఉంది. ఇక శ్రీహాన్ కి షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రత్యేక గుర్తింపు ఉంది. కాబట్టి వాళ్లిద్దరు టాప్ 5 లోకి రావడం పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. కానీ ఎలాంటి ఫ్యాన్ బేస్ లోని ఆదిరెడ్డి నాలుగోస్థానం వరకు రావడమే గ్రేట్. వాస్తవంగా చెప్పాలంటే ఆదిరెడ్డి నిజమైన విన్నర్ అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒక్కటి ఉంది. ఆదిరెడ్డి బిగ్ బాస్ విన్నర్ కాకపోయి ఉండొచ్చు.. కానీ తనదైన వ్యక్తిత్వంతో ప్రేక్షకుల మనస్సును మాత్రం గెలిచాడు. బిగ్ బాస్ సీజన్ లోకి రాకముందు వరకు కూడా చాలా మందికి ఆదిరెడ్డి తెలియదు. బిగ్ బాష్ షో అనంతరం అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ఓ సామాన్యడు బిగ్ బాస్ రివ్యూవర్ గా మారి.. అక్కడ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లడం.. అక్కడ నుంచి అందరిని దాటుకుంటూ టాప్-4 గా నిలవడం ఎందరికో ఆదర్శం. అందుకే చాలా మంది.. నిజమైన తోపు ఆదిరెడ్డి అంటూ కామెంట్స్ చెస్తున్నారు. సామాన్యుడి నుంచి బిగ్ బాస్ ఫేమ్ గా మారిన ఆదిరెడ్డిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.