‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ద్వారా ఎంత మంది సెలబ్రిటీలు అయ్యారు అనే మాటను పక్కన పెడితే.. ఒక ప్రేమజంట మాత్రం బ్రేకప్ చెప్పేసుకుంది. అయితే అది బిగ్ బాస్ వల్ల ఎందుకు జరిగింది అని అడగవచ్చు. సరే బ్రేకప్ ఎలా జరిగినా కూడా ఇప్పుడు ఆ జంట గురించే అందరి టాకు. బ్రేకప్ గురించి కారణాలు ఏంటనే విషయం అందిరికీ తెలిసిందే.
ఇప్పుడు కొత్త ప్రశ్న ఏంటంటే బ్రేకప్ తర్వాత వాళ్లు ఎలా ఉన్నారు? అవును బ్రేకప్ అంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. అది కూడా ఐదేళ్లు ప్రేమించుకున్న తర్వాత విడిపోతే ఆ బాధ ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకే దీప్తీ సునయన కూడా ఇన్ స్టా గ్రామ్ లైవ్ లో తన అభిమానులతో మాట్లాడుతూ ఏడ్చేసింది.
బాగా ఎమోషనల్ అయిన దీప్తీ సునయన నేరుగా షణ్ముఖ్ తో బ్రేకప్ గురించి మాట్లాడలేదు. ‘నేను లైవ్ లో ముందుకు వెళ్లాలి అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఎప్పుడూ నా కెరీర్ గురించి నేను ఆలోచించలేదు. ఇక నుంచైనా నా కెరీర్ గురించి ఆలోచించాలి అనుకుంటున్నా. నా కెరీర్ పై శ్రద్ధ పెట్టాలి అనుకుంటున్నాను’ అంటూ దీప్తీ సునయన ఏడ్చేసింది.