వైసీపీ ఎంపీ అశ్లీల వీడియో కాల్ అంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అందులో ఉన్నది వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో అశ్లీల వీడియో వ్యవహారంపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్వయంగా స్పందించారు. ఇదంతా తనపై జరిగిన కుట్ర అంటూ కొట్టిపారేశారు. దీని వెనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి హస్తం ఉందన్నారు.
“తెలుగుదేశం పార్టీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ వీళ్ల వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనేది తేల్చాలి. ఇలాంటి చెత్త వెధవలు నేను జిమ్ చేస్తున్న వీడియో మార్ఫ్ చేసి ఓ చెత్త వీడియో చేశారు. నన్ను టార్గెట్ చేస్తూ.. ఇబ్బంది పెట్టాలని ఇలా చేశారు. నేను ఏ విచారణకైనా సిద్ధం. ఫారెన్సిక్ టెస్టుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను” అంటూ మాధవ్ తెలిపారు.
ఈ వీడియో వ్యవహారంపై చట్టపరంగా వెళ్తామన్నారు. “ఈ వీడియో వ్యవహారంలో లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ఆ ముగ్గురిపై పరువునష్టం దావా వేస్తాను. ఇప్పటికే జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ వ్యవహారంలో నిజానిజాలను బయటకి తీయాలి. పోలీసు వ్యవస్థ అందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా నన్ను ఢీ కొట్టాలి అంతేగానీ ఇలాంటి పనులు చేయడం కాదు” అంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.