ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఛాతి నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను రాజమండ్రి సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం.. వైద్యులు గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈ విషయంపై స్పందించిన డాక్టర్లు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు తెలిపారు.
కాగా, ఎమ్మెల్యే ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయన భార్య రాజ్యలక్ష్మి చెప్పారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. అంతేకాదు.. త్వరలోనే నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారని తెలిపారు. అయితే.. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అస్వస్థతకు గురయ్యారని తెలిసి పోలవరం ప్రజలు ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. ఆయన అనుచరులు ఆసుపత్రి వద్ద భారీగా గుమికూడారు.
ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకి గుండె పోటు – రాజమండ్రిలోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స – స్టంట్ వేసిన వైద్యులు, ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడి #polavarammla #DialNews pic.twitter.com/YILZPEqYjQ
— Dial News (@dialnewsinfo) January 24, 2023