ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాట యుద్ధం సాగుతుంది. ఈక్రమంలో తాజాగా టీడీపీ అధినేత కాన్వాయ్ లోకి వైఎస్సార్ సీపీ వాహనాలు రావడం కలకలం రేపింది.
ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాట యుద్ధం సాగుతుంది. అలానే తరచు ఇరు పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుంటాయి. ఇలా సభలు నిర్వహిస్తున్న సమయంలోనూ, అధినేతలు వెళ్తున్న టైమ్ లోను కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఇటీవలే అనంతపురం జిల్లాలో సభ ముగించుకుని వెళ్తున్న సీఎం జగన్ కాన్వాయ్ కి కొందరు రైతులు అడ్డుగా పడుకోవడం కలకలం రేపింది. తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లోకి వైఎస్సార్ సీపీ వాహనాలు వచ్చాయి. దీంతో చంద్రబాబు భద్రత సిబ్బంది అలెర్ట్.. పరిస్థితులు చక్కదిద్దారు.
గురువారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి పర్యటిస్తున్నారు. చంద్రబాబు తణుకు నియోజకవర్గం ఇరగవరంలో రైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. అకాల వర్షాలకు వచ్చిన నష్టాన్ని రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ అధినేతకు రైతులు వివరించారు. ఇక పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం బయల్దేరారు. చంద్రబాబు కాన్వాయ్ ఉంగుటూరు సమీపానికి చేరుకునే సరికి రెండు వైఎస్సార్‌సీపీ కారులు చంద్రబాబు కాన్వాయ్‌లోకి వచ్చాయి.
దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. ఈ వాహనాలు చంద్రబాబు కాన్వాయ్ లోకి రావడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారు తాడేపల్లి గూడెం వరకు అనుసరించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. దాదాపు 15 కిలోమీటర్ల వరకు చంద్రబాబు కాన్వాయ్ ను అనుసరించిందని సమాచారం. ఇక భద్రత నిబంధనల ప్రకారం.. సీఎం, ప్రతిపక్షనేత వాహనాలు వెళ్లే వరకు సాధారణ వాహనాలను అనుమతించకూడదు. అలానే చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే వరకు సాధారణ వ్యక్తుల వాహనాలు అనుమతించకూడదని టీడీపీ నాయకులు అంటున్నారు.
ఒకవేళ అలాంటి వాహనాలు కాన్వాయ్ మధ్యలోకి పొరపాటున వచ్చినా.. పోలీసుల ఎస్కార్ట్ వెంటనే తప్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే చంద్రబాబు కాన్వాయ్ లోకి ఇతర వాహనాలు రావడం గుర్తించిన ఎన్ఎస్ జీ సిబ్బంది..వెంటనే రంగంలోకి దిగింది. అలానే ఆ వాహనాలను నియంత్రించి.. చంద్రబాబు కాన్వాయ్ కి లైన్ క్లియర్ చేసింది. జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ సీఎం కాన్వాయ్‌లోకి ఇలా వాహనాలు రావడం చర్చనీయాంశమైంది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.