ప్రవచన కర్త గరికపాటి నరసింహ రావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరు ఏమనుకున్న పదునైన మాటలతో ప్రసంగాలు చేస్తుంటారు. అయన ప్రసంగాలను వినేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన ప్రసంగాలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పుడప్పుడు తన ప్రసంగాల్లోతో గరికపాటి వివాదాల్లో చిక్కుకుంటారు. ఇటీవలే చిరంజీవి విషయంలో గరికపాటి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అది మరువక ముందే గరికపాటి తాజాగా మరో వివాదంలో చిక్కున్నారు. గరికపాటి నరసింహరావుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొందరు మహిళలు విశాఖపట్నంలో ఆందోళనకు దిగారు. తన ప్రసంగాల్లో ప్రతిసారీ మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేస్తారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రవచన కర్త, తెలుగు రచయిత గరికపాటి నరసింహరావు గారు..తన ప్రసంగాలో స్త్రీలపై పలు వ్యాఖ్యలు చేస్తుంటారు. వారు ఉండే విధానం, తీరు గురించి ముక్కు సూటిగా తెలియ జేస్తుంటాడు. అయితే అందరి విషయంలో కాదు.. కొందరి విషయంలోనే అన్నట్లు చెప్తుంటారు. అయితే ఆయన ప్రసంగాలను కొందరు వ్యతిరేకిస్తున్నారు. తన ప్రవచనాల్లో ప్రతిసారీ మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేస్తారంటూ గరికపాటిపై కొందరు విమర్శలు చేస్తుంటారు. తాజాగా విశాఖపట్నంలోని కొందరు మహిళలు గరికపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళాసాధికారతను ఇలా ఆధ్యాత్మిక ముసుగులో స్త్రీలను అణచివేయాలని చూస్తున్న గరికపాటిపై ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు.
విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళాసంఘాల ఆధ్వర్యంలో గరికపాటికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగింది. “మను వాదాన్ని స్థిరీకరిస్తూ, మహిళలపై హింసను ప్రేరేపిస్తూ, ఆధునిక మనువు గరికపాటిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి” అని రాసిన ఫ్లెక్సీలతో రోడ్డుపై ఆందోళనకు దిగారు హిందూ ధర్మ ప్రవచనాల పేరుతో మహిళలను అవమానించేలా గరికపాటి వ్యవహరిస్తున్న వారు ఆరోపించారు. అలాంటి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. గరికపాటిపై వెంటనే చర్యలు తీసుకోకుంటే ఈ ఉద్యమాన్ని మరింత పెద్ద ఎత్తున చేస్తామని మహిళలు తెలిపారు.