సుప్రియ అనే వివాహితను.. ఆమె అత్తింటివారు 14 ఏళ్లు చీకటి గదిలో బంధీని చేశారు. బయటి ప్రపంచంలో సుప్రియాకు సంబంధం లేకుండా ఓ చీకటి గదిలో బంధించి నరకయాతన చూపించారు. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి తనిఖీ చేయగా.. ఓ చీకటి గదిలో బంధీగా సుప్రియ పడి ఉంది. తాజాగా 14 ఏళ్ల చీకటి గోడలను బద్దలు కొట్టుకుని వచ్చిన సుప్రియ.. అనేక సంచలన విషయాలు బయట పెట్టారు.
విజయనగరంలో సుప్రియ అనే వివాహితను.. ఆమె అత్తింటివారు 14 ఏళ్లు చీకటి గదిలో బంధీని చేశారు. బయటి ప్రపంచంతో సుప్రియకు సంబంధం లేకుండా ఓ చీకటి గదిలో బంధించి నరకయాతన చూపించారు. కనీసం ఆమె తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. చివరకు తమ కుమార్తె ఆమె తల్లిదండ్రులు న్యాయస్థానం మెట్లెక్కారు. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి తనిఖీ చేయగా.. ఓ చీకటి గదిలో బంధీగా సుప్రియా పడి ఉంది. ఆమెను బయటకు తీసుకురాగా, బక్క పలుచని శరీరంతో కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే తాజాగా 14 ఏళ్ల చీకటి గోడలను బద్దలు కొట్టుకుని వచ్చిన సుప్రియ.. అనేక సంచలన విషయాలు బయట పెట్టారు.
తాను ఎమ్ఏ ఇంగ్లీష్ లీటరేచర్ చేశానని, అయిన తన భర్తను ఎప్పుడు ఎదిరించలేదని సుప్రియ తెలిపారు. తనకు పెళ్లైన కొత్తలో ఒకటి, రెండు సార్లు మాత్రమే బయటకు వచ్చానని ఆమె అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ..” నాకు చిన్న తనం నుంచి చాలా భయం ఎక్కువ. అందుకే ఎవర్ని ఎదిరించి మాట్లాడే సాహసం చేసేదాన్ని కాదు. ఏ సమస్య వచ్చిన సర్థుకపోయేదాన్ని. ఇక్కడ నన్ను బంధీ చేసిన తరువాత నాది వేరే ప్రపంచం అండి.. పని చేసుకోవడం ఓ మూలన కూర్చొవడం. వారు ఏది పెడితే అది తినడం తప్ప.. ప్రత్యేకంగా నాకు అంటూ ఏది ఉండదు.
14ఏళ్లు గా బయటి ప్రపంచంతో నాకు సంబంధం ఉండేది కాదు. ఇప్పుడిప్పుడు బయట ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాను. ఈ 14 ఏళ్లలో మా తల్లిదండ్రులతో సహా ఎవరితో నేను మాట్లాడింది లేదు. మా భర్త వాళ్లకు ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు నన్ను తిడుతుంటారు. వాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టిన భరిస్తూ వచ్చాను. నా జీవితం ఇంతేలా, నాకు శిక్ష అనుభవించాలని రాసి ఉందని అనుకుంటూ సర్థుకుపోయేదాన్ని. ఈ చీకటి ప్రపంచం నుంచి నన్ను బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు” అని సుప్రియా ఆవేదన వ్యక్తం చేశారు. నరకం నుంచి బయట పడ్డ సుప్రియాకు సంతోషంతో కన్నీళ్లు ఆగలేదు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను అనుకోలేదంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
అసలు ఏం జరిగిందంటే.. విజయనగరం చెందిన గోదావరి మధుసూదన్‌కు శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియకు 2008లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. మధుసూదన్ తన తల్లి ఉమామహేశ్వరి, తమ్ముడు దుర్గాప్రాద్ తో కలిసి ఉంటున్నారు. అయితే తల్లి, తమ్ముడు చెప్పుడు మాటలు విని భార్యను బయట ప్రపంచానికి దూరం చేస్తూ ఓ చీకటి గదిలో బంధించాడు. ఎప్పుడు కూడా బయటకు తీసుకురావడమే కాదూ మిగిలిన గదుల్లోకి కూడా తీసుకెళ్లేవాడు కాదూ. పిల్లల్ని కూడా ఆమె గదిలోకి వెళ్లనిచ్చేవాడు కాదూ. ఏకంగా 14 ఏళ్లు ఆమెను చీకటి గదికలో బంధీని చేశారు. చివరికి సుప్రియా తల్లిదండ్రుల సాయంతో చీకటి ప్రపంచం నుంచి బయటపడింది. మరి.. తాజాగా సుప్రియ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.