టీడీపీలో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాలం భాస్కరరావు అనారోగ్యంతో మరణించారు. నెల రోజుల క్రితం గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్న ఆయన కోలుకుంటున్న సమయంలో తుది శ్వాస విడిచారు.
టీడీపీలో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాలం భాస్కరరావు అనారోగ్యంతో మరణించారు. నెల రోజుల క్రితం గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్న ఆయన కోలుకుంటున్న సమయంలో తుది శ్వాస విడిచారు. ఇటీవల తీవ్అర అనారో బారిన పడిన ఆయన విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రాంబిల్లి మండలం లాలంకోడూరులోని స్వగృహం వద్ద పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. భాస్కర్‌రావు 2009 ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. భాస్కర్‌రావు సతీమణి భవానీ ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.
భాస్కరరావు మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి పార్టీకి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న భాస్కరరావు కోలుకుంటున్నారు అనుకున్న సమయంలోనే ఇలా దూరం అవ్వడం తనను ఎంతగానో బాధించిందని చంద్రబాబు అన్నారు. జిల్లాలో కీలక నేతగా పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. భాస్కరరావు సతీమణి భవానీకి ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన యలమంచలి నియోజకవర్గంలో టీడీపీ ముఖ్య నేత కాగా, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పార్టీకి ఆయన చేసిన సేవలు అభినందనీయమని అన్నారు.