ప్రజల రక్షణ, సమాజంలో అన్యాయాలను అరికట్టడం పోలీసుల బాధ్యత. విధుల్లో భాగంగా పోలీసులు ప్రజలతో కాస్త కఠినంగా వ్యవహరిస్తారు. అయితే పోలీసులు పైకి చూపించే కఠినశైలిని చాలామంది అపార్థం చేసుకుంటారు. అయితే వారి ఖాకీ చొక్క చాటున మంచి మనసు కూడా ఉంది. అందుకు నిదర్శనంగా ఇప్పటికే అనేక ఘటనలు జరిగాయి. తాజాగా అస్వస్థతకు గురైన ఇంటర్ విద్యార్థిని విషయంలో ఎస్సై మానవత్వం చాటుకున్నారు.
ప్రజల రక్షణ, సమాజంలో అన్యాయాలను అరికట్టడం పోలీసుల బాధ్యత. విధుల్లో భాగంగా పోలీసులు పౌరుల పట్ల కాస్త కఠినంగా వ్యవహరిస్తారు. అయితే పోలీసులు పైకి చూపించే కఠినశైలిని చాలామంది అపార్థం చేసుకుంటారు. అందుకే పోలీసులపై ఓ రకమైన నెగిటీవ్ ఫీలింగ్ ఎక్కువ మందిలో ఉంటుంది. పోలీసులకు మనస్సు అనేది ఉండదని, కఠినంగా ఉంటారని కొందరు అభిప్రాయ పడుతుంటారు. అయితే పోలీసుల్లో కూడా మంచి మనస్సు, మానవత్వం దాగి ఉందనడానికి అనేక ఘటనలే నిదర్శనం. తాజాగా ఇంటర్ ఎగ్జామ్స్ రాసేందుకు వెళ్లి.. తీవ్ర అస్వస్థతకు గురైన ఓ విద్యార్థిని ఎస్సై కాపాడారు. విద్యార్థికి సాయం చేసిన ఆ ఎస్సైపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు. మానవత్వం పరిమళించిన ఈ దృశ్యం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
గురువారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ద్వితియ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. అలానే ఒక నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈక్రమంలో అందరు విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే సెంటర్లకు చేరుకున్నారు. కొందరు విద్యార్థులు ఆరోగ్యం బాగాలేకపోయినా ఏడాది అంతా చదివిన చదువు.. పరీక్ష రాయకుంటే వృథా అవుతుందని.. పరీక్షలకు హాజరవుతున్నారు. అలానే నెల్లూరు జిల్లా ఆత్మకూరు చెందిన స్రవంతి అనే విద్యార్థిని కూడా పరీక్షకు హాజరైంది.
స్రవంతి చలి జ్వరంతో తీవ్ర బాధపడుతూనే ఆత్మకూరులోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో పరీక్షకు హజరైంది. అయితే జర్వంతో బాధపడుతున్న స్రవంతి తీవ్ర అస్వస్థతకులోనై కళ్లు తిరిగి పడిపోయింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై శివశంకర్ వెంటనే స్రవంతిని తీసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీస్ వాహనంలో ఇన్విజిలేటర్, విద్యార్థిని తల్లితో సహా దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఎస్సై తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించిన అనంతరం విద్యార్థిని తిరిగి పరీక్ష కేంద్రం వద్ద దింపడం జరిగింది. ఆపదలో ఉన్న ఆ విద్యార్థిని సకాలంలో కాపాడిన ఆత్మకూరు ఎస్సైకి, ఇతర పోలీసులకు యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
తన ఆరోగ్యంతో పాటు, ఏడాది కాలం పాటు చదివిన చదువును వృథ పోకుండా కాపాడిన పోలీసులకు యువతి ధన్యవాదాలు తెలిపింది. ఎస్సై శివశంకర్ చేసిన మంచిపనికి స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. మానవత్వం పరిమలించిందటూ.. కఠినమైన ఖాకీ చొక్క వెనకు మంచి మనస్సు ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ గుండె పోటుకు గురైన వ్యక్తికి ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. కలకత్తాలో ఓ విద్యార్థినికి పరీక్ష సమయంలో దాటిపోతుందని ఓ ఎస్సై గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఇలా ఎందరో పోలీసులు తమ మంచి మనస్సును చాటుకుంటున్నారు. మరి.. ఆత్మకూరు ఎస్సైపై మీ ప్రశంసలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.