సమాజంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు, దారుణాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఇంటి నుంచి కాలు బయటపెట్టిన ఆడబిడ్డకు రక్షణ అనేది లేకుండా పోతుంది. లైంగిక వేధింపుల వంటి ఘటనలతో మహిళలు తీవ్ర వేదన చెందుతున్నారు. కొందరు కామాంధులు దారుణంగా చిన్న పిల్లలను కూడా వదిలి పెట్టడటం లేదు. తమను ప్రేమించాలంటూ, కోరిక తీర్చాలంటూ అనేక రకాల వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఒక వ్యక్తి మనవరాలి వయస్సు ఉండే యువతిని లైంగికంగా వేధించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది.
విశాఖపట్నంలోని చినవాల్తేరు లోని ఓ అపార్టు మెంట్ లో ఓ బాలిక నివాసం ఉంటుంది. ఆ యువతిని స్థానికంగా ఉంటున్న రాఘవరావు అనే వ్యక్తి కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆ బాలికకు వాట్సాప్ లో అసభ్యకర మెసేజ్ లు పెట్టడంతో పాటు ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఈక్రమంలోనే బుధవారం మరోసారి ఆ బాలిక నివాసం ఉంటున్న ప్లాట్ కు రాఘవరావు మద్యం సేవించి వెళ్లాడు. ఇంట్లో నుంచి బయటకి రావాలంటూ ఆ బాలికను బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ బాలిక స్నేహితులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో వారు వెంటనే ఆ అపార్ట్ మెంట్ వద్దకు చేరుకుని.. అతడ్ని వారించే ప్రయత్నం చేశారు. వారిపైన కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయి బెదిరింపులకు దిగాడు.
అతడి ప్రవర్తనతో విసుకు చెందిన బాలిక అతడిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. “నువ్వు ఏం చేస్తున్నావో.. నీకు తెలుస్తుందా? నీ మనమరాలి వయస్సున్న నాతో ప్రేమేంటి? చెప్పుతో కొట్టమంటావా?” అంటూ ఆ బాలిక మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మద్యం సేవించి ప్లాట్ కు వచ్చిన రాఘవరావు జేబులో చిన్నకత్తి ఉండటానికి బాలిక స్నేహితులు గుర్తించి లాక్కున్నారు. ఈ ఘటనపై బాధితురాలి తరపువారు పోలీసులును ఆశ్రయించినట్లు తెలిసింది. అయితే అతడికి జనసేన పార్టీతో సంబంధాలు ఉన్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ వార్తలను జనసేన పార్టీ ఖండించింది. ఈ మేరకు జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ట్వీట్ చేశారు.
మహిళల పట్ల తప్పుగా, అసభ్యంగా లైంగింక వేధింపులకు గురిచేసేవాళ్ళని జనసేన పార్టీ ఎప్పుడూ క్షమించదు,అది తన వారైనా లేదా ఇతరులైనా సరే, ఈ విషయంలో జనసేన పార్టీ రాజీపడే ప్రసక్తే లేదు,తప్పు చేసినవాళ్ళు ఎవరైనా సరే న్యాయం ముందు నిలబడి తీర్పుని ఎదుర్కోవాల్సిందే https://t.co/mRalKpy3j2
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 29, 2022