రాజకీయాలు అంటే ఏసీ రూమ్ లో ఉంటూ మాట్లాడటం కాదు.. ప్రత్యక్షంగా జనంలోకి వెళ్లి వారి కష్టసుఖాల గురించి తెలుసుకొని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసేవాడు నిజమైన రాజకీయ నాయకుడు అంటారు. ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి రాజకీయవేత్తలు పాదయాత్ర చేపడుతుంటారు. పాదయాత్రలు చేసి ఎంతో మంది రాజకీయ నేతలు ప్రజల్లో తమ ఇమేజ్ పెంచుకున్నారు. పాదయాత్ర పునాధిగా ప్రభుత్వాలు సైతం ఏర్పడ్డాయి. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఇప్పుడు ఇదే ఫార్ములా ఫాలో అవబోతున్నారు టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి అయిన నారా లోకేష్.
2024 ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు నారా లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి పాదయాత్ర చేయడానికి సంకల్పించారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి 2023 జనవరి 27 న పాదయాత్ర చేయడానికి ముహూర్తం ఖరాచైనట్లు తెలుస్తుంది. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఎక్కడ కూడా విరామం తీసుకోకుండా ఏడాది పాటు కంటిన్యూ అయ్యేలా రూట్ మ్యాప్ తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం తెలుగు యువత రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. పాదయాత్రకు సంబంధించిన పలు టీమ్స్ లను ఏర్పాటు చేయడానికి చంద్రబాబు టీడీపీ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒక ఏడాది పాటు ప్రజల మద్యనే తన పాదయాత్ర కొనసాగిస్తూ.. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు.. నిరుద్యోగుల కష్టాలు.. ప్రస్తుతం ఏపీలో యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక ఏపిలో మహిళలకు రక్షణ లేకుకుండా పోతుందని ఇప్పటికే పలు సంద్భాల్లో మాట్లాడిన లోకేష్.. వారి కష్టాలు వెలుగులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయబోతున్నారట.. రైతుల సమస్యల పట్ల ప్రజలకు చైతన్యం కల్పించడంతో పాటు పాదయాత్రలో యువతను భాగస్వామ్యం అయ్యేలా ప్రణాళికలు రూపొందించబోతున్నట్లు సమాచారం. ఇక పాదయాత్ర కోసం పార్టీలోని ముఖ్యనేతలు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తుంది.