ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా తారకరత్నకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ని కుప్పంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. వైద్యులు ఆయనకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ ఆసుపత్రి వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా, నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు లోకేష్ తన మామ బాలకృష్ణ, టీడీపీ నేతలతో కలిసి లక్ష్మీపురం వరదరాజస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. లోకేష్‌కు మద్దతు తెలపటానికి తారకరత్న కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో నడుస్తూ ఉండగా.. ఉన్నట్టుండి కుప్పకూలారు. దీంతో ఆయన్ని వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిచారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరి, తారకరత్న హెల్త్ బులెటిన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Taraka Ratna Anna’s health condition was highly critical. Praying God and Wishing him a speedy recovery 🙏. #TarakaRatna pic.twitter.com/ZOmtviUGXG
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) January 28, 2023