చదువులో రాణించాలంటే కష్టపడి చదవాలి.. కానీ కొంతమంది విద్యార్థులు ఏమాత్రం కష్టపడకుండా పరీక్ష కేంద్రంలో రకరకాల పద్దతుల్లో కాపీయింగ్ కి పాల్పపడుతూ ఉంటున్నారు. కొన్నిసార్లు ఎగ్జామ్ హాల్ లో స్క్యాడ్స్ కి అడ్డంగా బుక్ అయి డిబార్ అవుతూ మంచి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు.
పరీక్షల్లో పాస్ అయ్యేందుకు కష్టపడి చదవాలి.. కానీ ఈ మద్య కొంతమంది విద్యార్థులు తప్పులు మార్గాలు ఎంచుకుంటున్నారు. ఎగ్జామ్ హాల్ లో రకరకాలుగా కాపీయింగ్ కి పాల్పపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇన్విజిలేటర్లకు అడ్డగా చిక్కిపోతున్నారు. అలానే పరీక్ష హాల్ లో కాపీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వారిని స్క్యాడ్స్ డిబార్ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా కొందరు విద్యార్థుల్లో మార్పులు రావడం లేదు.. పరీక్ష సమయాల్లో వెరైటీ పద్దతుల్లో కాపీయింగ్ కి పాల్పపడుతున్నారు. తాజాగా ఎగ్జామ్స్ లో తప్పకుండా పాస్ కావాలనే ఉద్దేశంత్య కొంత మంది విద్యార్థులు చేతులపై, చున్నీలపై ఆన్సర్లు రాసుకొచ్చి కాపీ కొట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే కొంతమంది డిగ్రీ విద్యార్థులు ఈజీగా పాస్ అయిపోవాలనే ఉద్దేశ్యంతో కాపీయింగ్ కి కొత్త రకం దారులను వెతుక్కుంటున్నారు. ఈక్రమంలో కొంతమంది అబ్బాయిలు చేతిపై ఆన్సర్లు రాసుకొని వస్తే.. అమ్మాయిలు తమ చున్నీలపై సమాధానాలు రాసుకొని వచ్చారు. ప్రస్తుతం ఎస్‌కేయూ పరిధిలోని డిగ్రీ ఫస్ట్ ఇయర్, మూడో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం పొలిటికల్ సైన్స్, సైకాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు పేపర్ – 1, బీబీఏ, బీసీఏ విద్యార్థులకు పేపర్ 2 ఎగ్జామ్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు కాపీయింగ్ కి పాల్పపడ్డారు. అందులో ఒక అమ్మాయి తన చున్నీపై సమాధానాలు రాసుకొని రాగా, మరో అబ్బాయి తన చేతిపై ఆన్సర్లు రాసుకొని వచ్చాడు. చున్నీపై ఆన్సర్లు రాసుకొచ్చిన అమ్మాయిని చూసి మొదట ఇన్విజిలేటర్లు ఆశ్చర్యపోయారు.. అమ్మాయిలు ఇలా కూడా కాపీ కొడతారా? అని షాక్ తిన్నారు. వెంటనే అధికారులకు తెలియజేయండంతో వీరిద్దరినీ డిబార్ చేశారు. అనంతపురంలో 5 మంది, తాడిపత్రిలో ఒక విద్యార్థి డిబార్ అయినట్లు పరీక్షల విభాగం నిర్వాహకులు ఆచార్య జి.వి.రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యనభ్యసించాలంటే కష్టపడి చదవాలని.. ఇలా కాపీయింగ్ చేస్తూ చదివేవాళ్లు సర్టిఫికెట్ మాత్రమే పొందుతారు.. జ్ఞానాన్ని పొందలేరని.. ఎందులోనూ రాణించలేరని అన్నారు. కాపీయింగ్ పాల్పపడితే ఎవరినీ క్షమించే ప్రసక్తి లేదని అన్నారు.