నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు, కూలీ పనులు చేసుకునే వారు ప్రాణాలు కోల్పోతున్నారు.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు, కూలీ పనులు చేసుకునే వారు ప్రాణాలు కోల్పోతున్నారు. అలానే మరెందరో గాయాలతో అల్లాడిపోతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేంద్రం సమీపంలో హైవేపై ఆదివారం రాత్రి 10.15 సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వినుకొండ వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు విజయవాడకు చెందిన సాయి(26), పిల్లి శ్రీనివాస్(23), చంద్రశేఖర్ (25) గుర్తించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను హైవే అంబులెన్స్, 108లో వినుకొండకు తరలించారు.
మార్గంమధ్యలో శకంర్ (24) అనే వ్యక్తి మృతి చెందాడు. వీరందరూ అనంతపురంలో ఒక వివాహ వేడక కోసం మండపం డెకరేషన్ చేసేందుకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు ఎస్సై జీవీ సైదులు తెలిపారు. ప్రమదా తీవ్రతకు కారు ముందు భాగం దారుణంగా దెబ్బతిన్నది. ఈ ఘోర ప్రమాదంతో నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఈ ప్రమాదాల నివారణకు మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.