ఇటీవల ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లె మహిళ బ్యాడ్మింటన్ విభాగంలో పీవీ సింధు స్వర్ణం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. దేశాన్నికి స్వర్ణం అందించి సింధుపై దేశం నలువైపుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులు సింధును అభినందించారు. ఈక్రమంలో ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా ఇంటికి వెళ్లారు. శనివారం రోజా ఇంటికి వెళ్లిన సింధు.. మంత్రి కుటుంబ సభ్యులతో కలసి లంచ్ చేశారు. సింధుతో గడిపిన మధుర క్షణాలను మంత్రి రోజా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
‘బంగారు పతకం సాధించిన మన ‘బంగారం’ సింధు తన కుటుంబంతో వచ్చి నన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. నా ఫ్యామిలీతో కలసి సింధు కుటుంబసభ్యులతో లంచ్ చేశాను’ అంటూ మంత్రి రోజా సంతోషం వ్యక్తం చేశారు. భారత హాకీ జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన క్రీడాకారిణి రజిని కూడా శనివారం రోజాను ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రోజా.. రజినిని ఘనంగా సన్మానించారు. మంత్రి రోజా, పీవీ సింధులతో కలిసి రజిని కూడా రోజా ఇంటిలోనే లంచ్ చేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బంగారు పతకం సాధించిన మన ‘బంగారం’ సింధు తన కుటుంబంతో వచ్చి నన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబంతో కలసి సింధు కుటుంబసభ్యులతో లంచ్ చేయడం జరిగింది. @Pvsindhu1 pic.twitter.com/xzfql3uyti
— Roja Selvamani (@RojaSelvamaniRK) August 20, 2022
It was grateful to meet our Andhra Pradesh sports minister dynamic women personality @RojaSelvamaniRK mam🙏🏻🙏🏻#sportsinap #TeamIndia #womenhockey pic.twitter.com/s6H8UlB5VJ
— Rajani Etimarpu (@RajaniEtimarpu) August 20, 2022