తెలుగు దేశం పార్టీ నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడైతే నేను మాత్రం మూర్ఖుడిని అంటూ అధికార వైసీపీ నేతలపై మండిపడ్డారు. నా తల్లిని ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలను, అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఇక రికార్డులు సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా.. ఒక్క టీడీపీతోనే సాధ్యమని ప్రకటించారు నారా లోకేష్. సమయం లేదు మిత్రమా.. ఇక రెండేళ్లే అంటూ సినిమా డైలాగ్ పేల్చాడు లోకేష్.
ఇది కూడా చదవండి: యన్టీఆర్ శాపం వల్లే చంద్రబాబు పరిస్థితి దిగజారిపోయింది: కొడాలి నాని
ఇది గాకఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అన్నది తమ నినాదమని అభివృద్ధిని వికేంద్రీకరణ చేసిన ఘనత చంద్రబాబుదే అని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీకి ప్రతిపక్ష హోదా సాధించిన ఏకైక పార్టీ టీడీపీయేనని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తెలుగు దేశం పార్టీ 40 వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో నారా లోకేష్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.