వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, పార్టీని పటిష్టం చేయడం కోసం.. టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గాయపడ్డారని సమాచారం. ఆ వివరాలు..
టీడీపీ యువ నేత నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పాదయాత్రలో భాగంగా ఏపీలో పర్యటిస్తున్నారు. శనివారం నాటికి పాదయాత్ర 46వ రోజుకి చేరుకుంది. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం, చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. అయితే శనివారం నాటి పాదయాత్రలో లోకేష్ కాస్త ఇబ్బంది పడుతూ కనిపించారు. ఆయన అస్వస్థతకు గురైనట్లు స్పష్టంగా అర్థం అవుతోంది అంటున్నారు లోకేష్‌ను దగ్గర నుంచి చూసిన కార్యకర్తలు. లోకేష్‌కు గాయాలు అవ్వడంతోనే.. పాదయాత్రలో కాస్త ఇబ్బంది పడుతున్నారు అని తెలుస్తోంది. రోజూ లోకేష్ పాదయాత్ర ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం ఉంటుంది. ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు లోకేష్‌తో సెల్ఫీ దిగుతుంటారు. అయితే శనివారం పాదయాత్ర ప్రారంభం ముందు ఈ సెల్ఫీ కార్యక్రమం నిర్వహించలేదు.
అందుకు కారణం లోకేష్ గాయపడటమే అని తెలుస్తోంది. లోకేష్ రెండు భుజాలకు గాయాలు అయ్యాయని.. ఆ కారణంగా సెల్ఫీలు కూడా తీయలేకపోయారని సన్నిహితులు చెబుతున్నారు. గాయాల కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నారని.. అందుకే స్వయంగా సెల్ఫీలు తీయడానికి వీలుకాకపోవడంతో ఇతరుల సహాయంతో లోకేష్ సెల్ఫీలు తీయించారని తెలిపారు. అలాగే పాదయాత్రలో కూడా లోకేష్ భుజాలు లేపి ప్రజలకు అభివాదం చేసేందుకు కాస్త ఇబ్బందిపడుతూ కనిపించారు. అయితే లోకేష్‌కు భుజాలకు గాయాలు అయ్యాయా లేక ఆయన ఇతర అనారోగ్య సమస్యలు ఎవైనా ఎదుర్కొంటున్నారా అనేది తెలియాల్సి ఉంది.
లోకేష్ భుజాలకు గాయాలు కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. యువగళం పాదయాత్ర శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగించుకుని.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా తమ అభిమాన నాయకుడు లోకేష్‌కు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఈ క్రమంలోనే కార్యకర్తల ఒత్తిడిలో లోకేష్ భుజాలకు గాయమైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ లోకేష్ గాయపడినట్లు.. కొంతమంది తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో.. ప్రస్తుతం దీనిపై చర్చించుకుంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.