నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అయితే.. ఈ ఘటన ఎలా జరిగిందన్నది తెలిసేలా పాదయాత్ర సీసీటీవీ విజువల్స్ బయటకొచ్చాయి. పాదయాత్రలో పెద్ద మొత్తంలో జనం హాజరవ్వడం.. కాస్త తోపులాట జరగడంతో తారకరత్న ఇబ్బందికి గురయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. తారకరత్న పరిస్థితి కొంచెం క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు కుప్పం పీఈఏస్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేనప్పటికీ.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మాసివ్ స్ట్రోక్ రావడంతోనే తారకరత్న కుప్పకూలిపోయారని అతనిని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. డాక్టర్లు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేసినట్లు సమాచారం.
— Hardin (@hardintessa143) January 27, 2023
కాగా, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య మీడియాతో మాట్లాడారు. తారకరత్నకు ఎలాంటి స్టంట్‌లు వేయలేదని.. యాంజియోగ్రామ్ మాత్రమే పూర్తైనట్లు వారు వెల్లడించారు. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు తెలిపారన్నారు. కోలుకున్న తర్వాత స్టంట్స్ వేస్తారా?.. ఇతర ట్రీట్‌మెంట్‌లు అందిస్తారా? అన్నది తెలియాలంటే వేచిచూడాలని పేర్కొన్నారు. పరిస్థితి పాజిటివ్‌గానే ఉందని, దేవుడి దయతో పాటు కుటుంబం సభ్యుల ప్రార్థనతో అతని ఆరోగ్యం మెరుగవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు బాలకృష్ణ. నందమూరి అభిమానులు ఆందోళన చెందవద్దని, తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన.