ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తన మంత్రి వర్గంలో కొత్తవారికి ఛాన్సు ఇచ్చారు. ఈ క్రమంలో సినీ నటి, నగరి ఎమ్మెల్యేకి ఏపి కెబినెట్ లో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఆర్కే రోజా తొలిసారిగా తన సొంత నియోజకవర్గం నగరికి వచ్చేశారు. అక్కడ ఆమెకు భారీ స్వాగతం లభించింది. రేణిగుంట నుంచి నగరి వరకు మధ్యలో ఉన్న అన్ని గ్రామాలు, పట్టణాల ప్రజలు మంత్రి రోజాకు బ్రహ్మరథం పట్టారు.
అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడారు. ఇక నుంచి ఏపీలో తన సత్తా ఏంటో చూపిస్తానని.. ఇప్పటి వరకు ఒక లెక్కని, ఇకపై మరో లెక్క అని పేర్కొన్నారు. తనకు ఇక సీటు రాదని, రోజా పని అయిపోయిందని ప్రచారం జరిగిందని, అలా ఎగతాళి చేసిన వారి నోళ్లు మూతపడేలా ఇక్కడి ప్రజలు తనను రెండుసార్లు గెలిపించారని అన్నారు. తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చారని, నగరి ప్రజలు తనకు రాజకీయ జన్మనిచ్చారని పేర్కొన్నారు.
బంపర్ మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసేందుకు సైనికుల్లా పనిచేస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా ప్రజల్లో ఆయన ఎంతో మంచి పేరు సంపాదించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ అన్న కోసం పోరాడుతానని ప్రత్యర్థి పార్టీలోని వారికా లేక, సొంత పార్టీలోనే ఉన్న ప్రత్యర్థి వర్గానికా అనేది విషయం పై చర్చలు నడుస్తున్నాయి.
నా కంఠంలో ప్రాణమున్నంత వరకు నగరి ప్రజలకు సేవ చేస్తాను. చివరి రక్తపుబొట్టు వరకు జగనన్న కోసం పని చేస్తాను. Thank You @ysjagan Anna🙏🙏🙏 pic.twitter.com/JeVosk6v66
— Roja Selvamani (@RojaSelvamaniRK) April 18, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.