గత కొంతకాలంగా నగరాల్లో, గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై నడుస్తున్న, ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిపై దాడి చేస్తున్నాయి. ఇటీవలే అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పెళ్లి బృందంపై ఓ పిచ్చి కుక్క దాడి చేసింది.
ఈ మధ్యకాలంలో నగరాల్లో, గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై నడుస్తున్న వారిపైనే కాకుండా ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిపై కూడా దాడి చేస్తున్నాయి. ఇటీవలే అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఒంటరిగా రోడ్డుపై ఉన్న బాలుడిని విచక్షణా రహితంగా కరచి బాలుడి ప్రాణాలు తీశాయి ఆ వీధి కుక్కలు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అందరి హృదయాలను కదిలించాయి. తాజాగా అలాంటి ఘటనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి బృందంపై ఓ పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో దాదాపు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో శుక్రవారం రాత్రి వివాహ వేడుక జరిగింది. ఆ వేడుకకు వధువరుల తరపు బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే రాత్రి పెళ్లి వేడుక జరుగుతుండగా ఓ పిచ్చికుక్కు హల్ చల్ చేసింది. ఆలయం లోపల, బయట స్వైర విహారం చేస్తూ పెళ్లికి వచ్చిన వారిపై దాడి చేసి.. తీవ్రంగా కరిచింది. అనంతరం పెళ్లి ప్రాంగణం నుంచి పరుగులు తీసి బస్టాండ్, బేకరీ, సెలూన్ దుకాణల వద్ద హల్ చల్ చేసింది. అక్కడ పలువురిపై దాడి చేసింది. పెళ్లికి వచ్చిన వారే గ్రామంలో ఆయా ప్రాంతంలో ఉన్నారు. దీంతో మొత్తం 10 మందిని ఆ పిచ్చి కుక్క గాయపర్చింది. కాళ్లు, చేతులు, తొడ భాగాలపై కుక్క కరిచిందని బాధితులు తెలిపారు.
పిచ్చి కుక్క దాడిలో గాయపడిన వారందరూ దేవరపల్లి, రావులపాలెం, దెందులూరు, బందపురం గ్రామాలకు చెందిన వారని స్థానికులు తెలిపారు. బాధితులందరిని దేవరపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. చికిత్స అందించిన తరువాత బాధితులకు వైద్యులు ఏఆర్వీ ఇచ్చారు. వారిని మెరుగైన వైద్యం నిమిత్తం అంబులెన్స్ , ఇతర వాహనాల్లో గోపాలపురం, కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఇప్పటికే పలు చోట్ల కుక్క దాడుల ఘటనలను అందరిలో భయాందోళన కలిస్తున్నాయి. ఈ తరుణంలో పెళ్లి బృందంపై పిచ్చి కుక్క దాడి చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. మరి.. ఇలా వరుసగా కుక్కలు దాడి చేసిన ఘటనలు జరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.