పోలీసులు అంటే చాలా మందికి భయం, కొందరికి కోపం ఉంటుంది. కారణం పోలీసులు విధి నిర్వహణలో ఒత్తిడి. జనం రూల్స్ పాటించకపోతే వచ్చే కోపం, నేరాలు అరికట్టేందుకు కాఠిన్యం చూపిస్తోంటారు. అది సాధారణంగా జనానికి కనిపించే పోలీసుల తీరు. కానీ కొందరు పోలీసులు సమయానుసారం వారిలోని మానవత్వాన్ని బయటపెడుతుంటారు. మరికొన్ని సార్లు మంచి పనులతో ప్రజల చేత ఔరా అనిపించుకుంటారు.
ఈ కోవలోకే వస్తారు పలాస కాశీబుగ్గ ఎస్సై శిరీష.ఆమె చేసిన పని పోలీసులపై మరింత గౌరవ భావం ఏర్పడేలా చేసింది. కర్తవ్యం సినిమాలో విజయశాంతిని చూసి పోలీసుగా కావలనుకున్న ఎస్సై శిరీష జీవితంలో అనే ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఓ సాధారణ మహిళ నుంచి ఎస్సైగా మారాటానికి సాగిన ఆమె జీవిత ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శిరీష స్వస్థలం విశాఖపట్నంలోని రామాటాకీస్ ప్రాంతం. తల్లిదండ్రులు కొత్తూరు అప్పారావు, రమణమ్మ కూలీ పనులు చేసేవారు. ఆమెకు ఓ అన్నయ్య, ఓ సోదరి ఉన్నారు. అప్పట్లో వారి కులంలో ఆడపిల్ల అంటే పరదా చాటున ఉండాల్సిందే. అందులో ఆమె తండ్రి ఆడపిల్లను భారంగా భావించే వారు. ఆ కారణంతో శిరీషాకు 13 ఏళ్లకే పెళ్లి చేశారు. కానీ చదువుకోవాలనే కోరిక ఆమెకు బలంగా ఉండేది.
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకంతో విశాఖలోని ఉమెన్స్ కళాశాలలోఎం.ఫార్మసీలో చదివింది. గ్రూప్-1 సాధించి డీఎస్పీ కావాలన్నదే ఆమె లక్ష్యం పెట్టుకోని ఆ దిశగా ప్రయత్నం చేశారు. మొదటి సారి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ఉద్యోగంలో భాగంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ గా మద్దిలపాలెం ఎక్సైజ్ కంట్రోల్ రూమ్‌లో పనిచేశారు.
2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో వాళ్ల ఎస్పీ ఆఫ్ ట్రాల్ కానిస్టేబుల్ వని శిరీషాని మందలించాడు. ఆ మాటలే మనుసులో పెట్టుకోని పోలీసుల వ్యవస్థలోనే ఉన్నతమైన జాబ్ పొందాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా 8 నెలలపాటు ఉద్యోగానికి సెలవులు పెట్టి ఎస్సై పరీక్షలు ప్రిపేరయ్యింది. చివరికి ఎస్సైగా ఉద్యోగం సాంధించింది. అవమానించిన ఎస్పీ చేతనే సన్మానం పొందింది.
ఇటీవల పలాస మండలంలోని మారుమూల ప్రాంతమైన అడవికొత్తూరులో ఉన్న అనాథ శవాన్ని ఎస్సై శిరీష మరొకరి సహకారంతో కిలోమీటరు మేర వరి పొలాల గట్లపై మోసకుంటూ వచ్చారు. ఆమె చేసిన ఈ మంచి పనితో ఒక్కసారిగా వార్తలోకి నిలిచారు. ఎందరో ఆమె చేసిన పనికి సెల్యూట్ పోలీస్ అంటూ ప్రశంసించారు. ఆమె జీవితలో ఎన్నో కష్టాలు ఎదుర్కోని ఓ ఉన్నత పదవి సాధించడం ఎందరో మహిళలకు, ఆడపిల్లలకు ఆదర్శం. ఆమె జీవితలో ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.