దేశలోని అన్ని రాష్ట్రాల రాజకీయాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో భిన్నంగా ఉంటాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇలా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో తరచూ ఆడియో రికార్డులు బయటపడి.. హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇటీవలే నెల్లూరు జిల్లాలో లీకైనా ఆడియో రికార్డు ఏ రేంజ్ లో కలకలం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ ఆడియో కారణంగా గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు.. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ నాయకుడు మాట్లాడుతున్నట్లు ఓ ఆడియో వైరల్ అవుతోంది. గతంలోనూ చంద్రబాబును ఉద్దేశిస్తూ.. పార్టీలేదు బొక్కా లేదని అచ్చెన్నాయుడు మాట్లాడినట్లు ఉన్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా లోకేశ్ పాదయాత్ర గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నట్లు ఉన్న మరో ఆడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతోన్న ఆ ఆడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
వైసీపీ ప్రభుత్వ పాలలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ‘యువగళం’ పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 27న కుప్పంలో మొదలు పెట్టిన ఆయన పాదయాత్ర ఇప్పటికే 13 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని.. తాజాగా గంగాధర నెల్లూరు నియోజవర్గంలోని ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదే సమయంలో లోకేశ్ పాదయాత్రపై అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. లోకేశ్ చేసేది పాదయాత్ర కాదని, అది పాడేయాత్రని, అంతేకాక లోకేశ్ యాత్రకు జనాలు ఎవరు రాక అట్టర్ ఫ్లాప్ అయ్యిందంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచకపడుతున్నారు.
వారి మాటలకు బలం చేకూర్చేలా ఓ ఆడియో బయటకు వచ్చింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ నాయకుడితో.. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సంభాషించినట్లు ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..” మీ నియోజకవర్గంలో జరగనున్న లోకేశ్ పాదయాత్రలకు జనాలు బాగా కనిపించాలి” అని అంటాడు. అలానే అన్న ఇప్పటికే రోజుకు 1000 మంది ఉదయం 8 గంటలకే లోకేశ్ సార్ పాదయాత్రలో ఉండేలా ఏర్పాటు చేశామంటూ తెదేపా నాయకుడు సమాధానం ఇచ్చాడు. ఈక్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చిత్తూరులో లోకేశ్ పాదయాత్ర చూసి తాను, సారూ బాధపడినట్లు, అలానే జనసమీకరణ విషయంలో ఏదైన ఇబ్బంది ఉంటే తమకు తెలపండన్నారు. తమ నియోజకవర్గంలో అలా జరగదని, చిత్తూరు జిల్లాలోనే లోకేశ్ చేస్తున్న పాదయాత్రలో తమ నియోజవర్గం మీదుగానే ఎక్కువ సాగుతుందని, అందుకు తగినట్లే ఏర్పాట్లు చేశామని టీడీపీ నాయకుడు తెలిపాడు.
అంతేకాక లోకేశ్ పాదయాత్రలో ప్రతి 1.5 కిలోమీటర్ కు వెల్ కమ్ బోర్డు పెడతామని, డప్పులతో, మహిళల హారతులతో ఘన స్వాగతం చెప్పేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు సదరు వ్యక్తి తెలిపాడు. అందరు సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని, మీరు చేసే అన్ని తమకు తెలుస్తుంటాయని అచ్చెన్నాయుడు అన్నారు. ఇప్పుటి వరకు జరిగిన నాలుగు నియోజకవర్గాల్లో కంటే జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్రను విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు అన్నట్లు ఆడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ ఆడియోపై అచ్చెన్నాయుడు, టీడీపీ శ్రేణులు వివరణ ఇస్తారో చూడాలి. మరి.. ఈ ఆడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.