“జగనన్నే మా భవిష్యత్తు” సర్వే కార్యక్రమానికి ఏపీ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. జనం ఈ సర్వేలో పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. మూడు రోజుల్లోనే 28 లక్షల మంది సర్వేలో పాల్గొన్నారు.
అధికార వైఎస్సార్ సీపీ చేపట్టిన “జగనన్నే మా భవిష్యత్తు” సర్వే కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో చర్రిత లిఖించే దిశగా ఈ కార్యక్రమం అడుగులు వేస్తోంది. జనం పెద్ద ఎత్తున జగనన్నే మా భవిష్యత్తు సర్వేలో పాల్గొంటున్నారు. మూడు రోజుల్లోనే 28 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. 20 లక్షలకుపైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. కాగా, జగనన్నే మా భవిష్యత్తు సర్వే కార్యక్రమం ఏప్రిల్ 7న శుక్రవారం నాడు ప్రారంభం అయింది.
ఏప్రిల్ 7నుంచి 20 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మెగా సర్వే జరగనుంది. ఇందుకోసం 7 లక్షల మంది పార్టీ కార్యకర్తలు రంగంలోకి దిగారు. ఈ 7 లక్షల మంది కార్యకర్తల్లో కొత్తగా నియమించబడిన గృహ సారధి, వార్డు సచివాలయం కన్వీనర్లు ఉన్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన వీరంతా మొత్తం 14 రోజుల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించనున్నారు. ఏపీలోని 1.65 కోట్ల గడపలకు వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. గతంలో ఈ కార్యక్రమంపై సజ్జల మాట్లాడుతూ.. వైసీపీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోందని అన్నారు.
కుల, మత, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోందని వెల్లడించారు. దాని వల్ల సంక్షేమ పథకాల అమలులో మధ్యవర్తులు, అవినీతికి తావు లేకుండా చేసిందని తెలిపారు. కానీ, టీడీపీ హయాంలో మాత్రం సంక్షేమ పథకాలు అందాలంటే ప్రజలు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చేవారని ఆరోపించారు. ఈ పరిస్థితిని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిందని అన్నారు. మరి, “జగనన్నే మా భవిష్యత్తు” సర్వే కార్యక్రమానికి వస్తున్న స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.