వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మక జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ మెగా సర్వే పూర్తి వివరాలను పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు మీడియా సమావేశంలో వెల్లడించారు.
“జగనన్నే మా భవిష్యత్తు” సర్వే కార్యక్రమానికి ఏపీ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. జనం ఈ సర్వేలో పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. మూడు రోజుల్లోనే 28 లక్షల మంది సర్వేలో పాల్గొన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ రైతు భరోసా వంటి ఎన్నో పథకాలను ప్రజా సంక్షేమం కోసం ప్రారంభించి.. దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఇలానే గత ప్రభుత్వ పాలనకు, వైసీపీ పరిపాలనకు గల తేడాలను వివరిస్తూ ప్రజల్లోకి పలు కార్యక్రమాలు తీసుకెళ్లారు. తాజాగా మరో గొప్ప కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది