భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. శ్రీహరి కోట నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన SSLV D1 రాకెట్ ఇప్పటి వరకు మూడు దశలను విజయంవంతంగా పూర్తిచేసుకున్నది. శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈరోజు ఎస్‌ఎస్‌ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగాన్ని సైంటిస్టులు చేపట్టారు. 13.2 నిమిషాల్లో ప్రయోగం పూర్తయ్యింది.
ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహ వాహక నౌక ఎల్‌ఎస్‌ఎల్వీ-డీ1 ని రూపొందించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని(షార్) నుంచి నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించారు. ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లించింది.
స్కూళ్ల విద్యార్థినులు అజాదీశాట్ ఉపగ్రహాన్ని రూపొందించారు. అజాదీ కా అమృత్ మహోత్సవ వేళ ఈ చిన్న శాటిలైట్ వెహికిల్‌ను ఇస్రో ప్రయోగించి చరిత్ర సృష్టించింది. దీని వల్ల మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ అనుసంధానికి ఉపయోగ పడుతుంది. ఈఓఎస్-02 ఉపగ్రహాలను తక్కువ ఎత్తులోని సమీప భూకక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. గత కొద్ది వారాలుగా శాస్త్రవేత్తలు స్మాల్ లాంచ్ వెహికల్స్‌ను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నారు.
ఇక 34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1ను నాలుగు దశల్లో ప్రయోగించారు. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనంతో 127.5 సెకన్లలో పూర్తి చేయగా.. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 336.9 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 633.3 సెకన్లలో పూర్తి చేయగలిగారు. చివరిగా నాలుగో దశలో 0.05 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి, 742 సెకన్లలో 135 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్–2ఏ(ఈఓఎస్‌శాట్)ను ముందుగా రోదసీలోకి ప్రవేశపెట్టారు.
ISRO launches its new SSLV-D1 rocket from Sriharikota
Read @ANI Story | https://t.co/uIPigY0TNL#ISRO #SSLVD1 #ISROIndia pic.twitter.com/7duROVWlp5
— ANI Digital (@ani_digital) August 7, 2022