ఇటీవల ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో ఏదో ఒక అక్రమం బయట పడుతుంది. తెలంగాణలో పేపర్ లీకేజ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అలానే పదో తరగతి ఓపెన్‌స్కూల్ పరీక్షల్లో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ఏదో విధంగా ఓపెన్ స్కూల్ పరీక్షల్లో పాస్ కావాలని కొందరు అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఇటీవలే అరకు లోయలో తెలుగు పరీక్ష జరిగిన సమయంలో హాల్ టికెట్లలో ఫొటోలు వున్న అభ్యర్థులు కాకుండా వేరే వారు పరీక్ష రాస్తుండడాన్ని గుర్తించారు. తాజాగా అలాంటి ఘటనే ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఇటీవల ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో ఏదో ఒక అక్రమం బయటపడుతుంది. అలానే పదో తరగతి ఓపెన్‌స్కూల్ పరీక్షల్లో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ఏదో విధంగా ఓపెన్ స్కూల్ పరీక్షల్లో పాస్ కావాలని కొందరు అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఇటీవలే అరకు లోయలో తెలుగు పరీక్ష జరిగిన సమయంలో హాల్ టికెట్లలో ఫొటోలు వున్న అభ్యర్థులు కాకుండా వేరే వారు పరీక్ష రాస్తుండడాన్ని గుర్తించారు. ఈ క్రమంలో పరీక్షలు రాస్తుండగా కొందరి బినామీ అభ్యర్థులను అధికారులు పట్టుకుని బయటకు పంపేశారు. అలానే తాజాగా శనివారం కూడా ఏలూరులో ఇలాంటి అక్రమాలు జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏలూరు జిల్లాలోని పాలకొల్లులోని సుభాష్ చంద్రబోస్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈక్రమంలో శనివారం ఇంగ్లీష్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరిగింది. శనివారం ఇంగ్లిష్ పరీక్ష సందర్భంగా ప్రశ్నాపత్రాలను అందించిన తరువాత విద్యార్థుల హాల్ టికెట్‌లను ఇన్విజిలేటర్లు తనిఖీ చేశారు. ఈ సమయంలో నలుగురు విద్యార్థులకు బదులుగా వేరే నలుగురు పరీక్షలు రాస్తున్నట్లు ఇన్విజిలేటర్లు గుర్తించారు. వారు వెంటనే సూపరింటెండెంట్‌కు సమాచారం ఇవ్వడంతో ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ జీఎల్‌వీవీ లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలుగు పరీక్ష రోజు మొదటి రోజు కావడంతో ప్రశ్నాపత్రాలు సరిచూసుకోవడంలో మునిగిపోవడంతో ఈ విషయాన్ని గుర్తించలేకపోయామని సూపరింటెండేట్ అన్నారు. అయితే శనివారం తనిఖీలో అసలు వారికీ బదులు పరీక్షలు రాస్తున్న నకిలీ వ్యక్తులను గుర్తించామని, వారిని స్కాడ్ బృందానికి వద్దకు తీసుకువెళ్లగా కేసు నమోదు చేయాలని సూచించారని సూపరింటెండెంట్ లక్ష్మీ తెలిపారు. ఇలా రెగ్యూలర్ పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకవుతుంటే.. ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల్లో ఏకంగా అభ్యర్థే మారి నకిలీ వ్యక్తులు రాస్తున్నారు. మరి.. విద్యావ్యవస్థలో జరుగుతున్న ఇలాంటి అక్రమాల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.