టీడీపీకి మరో గట్టి షాకే తగిలేలా ఉంది. పార్టీ నుంచి మరో సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం లేదా, మరో ఐదు రోజుల్లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసి, ఇప్పటివరకు పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు గోరంట్ల రాజీనామా చేయడం అంటే టీడీపీకి పెద్ద షాకే అవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో గోరంట్ల చౌదరి ముందుంటారు. సామాజిక అంశాలపై, రాజకీయ అంశాలపై గోరంట్ల చాలా గట్టిగానే తన గళాన్ని వినిపిస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాల్లో గెలవగా.. నలుగురు నేతలు పార్టీని విడారు. ఇప్పుడు గోరంట్ల కూడా రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటా అని పార్టీ వర్గాల్లో గుబులు మొదలైంది.
గోరంట్ల రాజీనామా నిర్ణయానికి అసంతృప్తే కారణంగా తెలుస్తోంది. చంద్రబాబు బుచ్చయ్య చౌదరికి కాల్ చేసి మాట్లాడారు. స్థానికంగా ఏం ఇబ్బందులున్నా చెప్పండని సూచించారు. రాజీనామా గురించి మీడిమా ప్రశ్నించగా ఇప్పుడేం చెప్పలేను అని సమాధాన మిచ్చారు. అనుబంధ కమిటీలు, స్థానిక ఆధిపత్యం అంశాలలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి గానీ, సీనియర్ల పూర్తిగా పక్కన పెట్టేయండి ఏంటి అని వాదనగా తెలుస్తోంది. ఫోన్ చేస్తే చంద్రబాబు, లోకేష్ కనీసం లిఫ్ట్ చేయట్లేదని గోరంట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీలో సీనియర్ నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా అని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.