ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా పదవతరగతి పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయని వార్తలు వస్తున్న విషయం విధితమే. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కొండాపూర్ లో ఆయన ఇంటికి వెళ్లి ఏపీ సీఐడీ అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇటీవల ఏపీలో పదవతరగతి పరీక్షా పత్రాలు లీక్ విషయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఇటీవల తిరుపతి పర్యటనలో సీఎం జగన్ బహిరంగ సభలో పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీపై మాట్లాడారు.
తమ స్వార్థం కోసం విద్యార్థులు జీవితాలతో కొన్ని విద్యా సంస్థలు ఆడుకుంటున్నాయని.. పదో తరగతి ప్రశ్నా పత్రాలను నారాయణ, చైతన్యస్కూల్స్ నుంచి లీక్ చేయించారని సీఎం జగన్ అన్నారు. నారాయణ స్కూల్ ఎవరిదో తాను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని.. ఆ స్కూల్ టీడీపీ నేతది కాదా అని నిలదీశారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.