చిన్న పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్కోసారి సరదాగా అనిపిస్తే.. మరొకసారి విసుగు తెప్పిస్తుంటుంది. ఇక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు, అన్నా చెల్లెల్లు ఉంటే పరిస్థితి చెప్పనక్కర్లేదు. పాము, ముంగీసలా నిత్యం తగువులాడుతూనే ఉంటారు. తాజగా ఓ రెండేళ్ల బుడతడు.. అతను మించిన పనే చేసాడు. పొరుగున ఉండేవాళ్ళను, స్థానికులను పరుగులు పెట్టించాడు.
చిన్న పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్కోసారి సరదాగా అనిపిస్తే.. మరొకసారి విసుగు తెప్పిస్తుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే.. పిల్లల గొడవలు, అల్లరి పనులు తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా పరిణమిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు, అన్నా చెల్లెల్లు ఉంటే పరిస్థితి చెప్పనక్కర్లేదు. పాము, ముంగీసలా నిత్యం తగువులాడుతూనే ఉంటారు. చీటికి మాటికి కొట్టుకుంటారు. అయితే తాజగా ఓ రెండేళ్ల బుడతడు.. అతను మించిన పనే చేసాడు. అతడు చేసిన అల్లరికి.. స్థానికంగా రెండు గంటల పాటు ఉత్కంఠ నడిచిందనే చెప్పాలి. ఆ వివరాలు..
రాజమండ్రి, ప్రకాశ్‌నగర్ పరిధిలోని సాయిరాఘవ టవర్స్ మూడో ఫ్లోర్‌లో సంతోషలక్ష్మి కుటుంబసభ్యులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు సంతానం. మంగళవారం ఉదయం బాలుడికి బాత్‌రూమ్‌లో స్నానం చేయించిన ఆమె, పిల్లాడిని రూమ్ బయట వదిలింది. ఆ తర్వాత తాను స్నానం చేయడం కోసం లోపలి వైపు గడియ పెట్టుకుంది. ఇంతలో ఆ బాలుడు బాత్‌రూమ్ డోర్ దగ్గర ఆడుకుంటూ గడియ పెట్టేశాడు. ఆపై బాలుడు బాల్కనీలో ఆడుకుంటుండగా గ్రిల్‌లో కాలు పెట్టడంతో అది ఇరుక్కుపోయింది. కాలు బయటకు రాకపోకపోవడంతో బాలుడు పెద్దగా ఏడుస్తున్నాడు. కేకలు విన్న తల్లి బయటకు వద్దామని చూస్తే.. గడియ పెట్టడంతో రాలేకపోయింది.
కుమారుడికి ఏం జరిగిందన్నది ఆమెకు తెలియడం లేదు. చెప్పే వయసు బాలుడి కాదు. ఏం జరిగిందో అని కంగారుపడ్డ ఆమె గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. వెంటనే పొరుగున ఉండేవాళ్లు పరుగున వచ్చినా లోపలికి వెళ్దామంటే మెయిన్ డోర్ వేసి ఉంది. లోపల ఏం జరుగుతుందో అర్థంకాలేదు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకొని నిచ్చెన సాయంతో బాల్కనీలో చేరగా అసలు విషయం అర్థమైంది. వెంటనే గ్రిల్స్‌లో ఇరుక్కున్న బాలుడిని కాపాడిన సిబ్బంది, లోపాలకి వెళ్లి బాత్‌రూమ్ గడియ తీయడంతో ఆమె బయటకు వచ్చారు. బుడతడు చేసిన ఈ పనితో పొరుగున ఉండేవాళ్లు, స్థానికులు రెండు గంటల పాటు ఎంత టెన్షన్ పడ్డారంటే.. వర్ణనా తీతం అని చెప్తున్నారు. మీ ఇంట్లో ఇటువంటి అల్లరి పిల్లలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని మనవి. ఇలాంటి అనుభవాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.