ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయం సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఇటీవల తరచూ అగ్నిప్రమాదలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరేందరో తీవ్రగాయాలతో జీవితాన్ని కష్టంగా వెల్లదీస్తున్నారు. గతంలో సికింద్రాబాద్ లోని ఓ లాడ్జీలో అగ్నిప్రమాదం జరిగి పది మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. అలానే ఇటీవలే అనంతపురం జిల్లాలో అగ్నిప్రమాదం కారణంగా 86 గొర్రెలు అగ్నికి ఆహుతయ్యాయి. తాజాగా తిరుపతి జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
తిరుపతి జిల్లా రేణిగుంటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఉన్న ఫాక్స్ లింక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో నుంచి భారీగా మంటలు ఎగసిపడుతుంటంతో, కార్మికులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిశ్రమలో చెలరేగిన మంటల ధాటికి చుట్టుపక్కల నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.